MoviesTollywood news in telugu

Pushpa Movie:పుష్ప సినిమాని మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

Pushpa Movie :ఒక్కోసారి అనుకోకుండా వదిలేసుకున్న మూవీస్ హిట్ అయిపోతుంటాయి. కొన్ని ప్లాప్ అవుతాయి. హిట్ అయితే అయ్యో మంచి మూవీ వదిలేసామే అని బాధపడతారు. డిజాస్టర్ అయితే బాగానే వదిలేసుకున్నాం అని సంతోషపడతారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ యన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ దాకా, సూపర్ స్టార్ కృష్ణ నుంచి మహేష్ బాబు దాకా అందరి హీరోల్లో ఇలాంటివి మామూలే.

తాజాగా రంగస్థలం బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబుని దృష్టిలో ఉంచుకుని డైరెక్టర్ సుకుమార్ పుష్ప మూవీ ప్లాన్ చేసాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ కథ నచ్చకపోవడంతో మహేష్ వదిలేసాడు. దాంతో అది కాస్తా అల్లు అర్జున్ తో సుకుమార్ తెరకెక్కించాడు.

ఇక అర్జున్ రెడ్డి మూవీ తీసిన సందీప్ వంగా కూడా ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీని రూపొందించడానికి మహేష్ బాబుని కలిస్తే, నో చెప్పాడట. దాంతో బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తో సందీప్ సినిమా ప్లాన్ చేసాడు. అది నిజానికి మహేష్ కి వినిపించిన కథే నట. అలాగే పూరి జగన్నాధ్ తయారు చేసిన జనగణమన మూవీని కూడా మహేష్ వదిలేయడంతో పవన్ కళ్యాణ్ తో పూరి ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."