Garlic Bread : బేకరీలలో లభించే గార్లిక్ బ్రెడ్ ని ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు.. చాలా ఈజీ.
Garlic Bread Recipe : తిన్న ఫుడ్ మళ్లీ మళ్లీ తినాలన్నా, చేయాలన్నా, బోర్ కొడుతుంది. కొత్త కొత్త ఐడియాలతో, కొత్త వంటకాలు తయారు చేసుకుంటే, చేసే వారికి తినేవారికి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
కావాల్సిన పదార్ధాలు
మైదా – 250 గ్రాములు
మిల్క్ పౌడర్ -1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి పొడి – 1 టీ స్పూన్
ఒరిగానో – 1 టీ స్పూన్
ఉప్పు – తగినంత
బటర్ – 1 టీ స్పూన్
నూనె – 1 టీ స్పూన్
చక్కెర – 1 టీ స్పూన్
యాక్టివ్ ఈస్ట్ – 1 టేబుల్ స్పూన్
బొంబాయి రవ్వ – 1/4కప్పు
చల్లీ ఫ్లెక్స్ – 1/8 టీ స్పూన్
తయారీ విధానం
1.గోరు వెచ్చని నీటిలో చక్కెర వేసి, కరిగించండి.
2. యాక్టివ్ ఈస్ట్, మరియు మైదా వైసి, 5 నిముషాలు అలాగే ఉంచండి.
3. తర్వాత దానిని ఉడకపెట్టండి.
4.ఈస్ట్ వాటర్ లో, బ్రెడ్ కోసం, మిల్క్ పౌడర్, ఒరిగానో, బటర్, వెల్లుల్లి వేసుకుని, బాగా కలపండి.
5. 7 నుంచి 8 నిముషాల వరకు, పిండిని బాగా కలపాలి.
6. 5నిముషాల తర్వాత బటర్, ఆయిల్ వేసుకుని, మరింత మెత్తగా కలుపుకోవాలి.
6. 8 నిముషాల తర్వాత , పొరలా సాగేలాగ, పిండిని లాగుతూ, కలుపుకుని, ముద్దగా తయారు చేసుకోవాలి.
7. ఆ తర్వాత, పాన్ లో ఆయిల్ పోసి, పిండిని, ఆ పాన్ లో వేయండి.
8. దానిని ఒక గుడ్డతో కప్పి ఉంచండి.
9. కాసేపటికి ఉబ్బిన ఆ పిండి ముద్దను, బాగా కలుపుకుని, మందపాటి చపాతిలా చేసుకోండి.
10.చుట్టిన పిండిపై , వెన్న, వెల్లుల్లి పొడి, చిల్లీ ఫ్లేక్స్ , మరియు ఓరిగానో చల్లి మధ్యలోకి మడవండి.
11 కాల్చేటప్పుడు విరిగిపోకుండా, అంచులను లోపలికి నొక్కండి.
12. ఇప్పుడు చేసుకున్న గార్లిక్ బ్రెడ్ ను, ఒక ట్రేలోపెట్టి, గుడ్డ కప్పి 30 నిముషాలు పక్కన పెట్టండి.
13. బ్రెడ్ పై పూత పూయడానికి కావాల్సిన పదార్ధాలను బటర్ లో వేసి బాగా కలపాలి.
14. పక్కన పెట్టుకున్న బ్రెడ్ పై వన్నను అప్లై చేసుకోవాలి.
15. ఇప్పుడు పిజ్జా కట్టర్ తో దాన్ని కట్ చేసుకోవాలి.
16. 220 డిగ్రీల వరకు వేడి చేసినా, ఓపెన్ లో మధ్య రాక్ లో పెట్టి 20 నుంచి 25 నిముషాల వరకు బేక్ చేసుకోవాలి.
17.గోల్డెన్ బేక్ చేసిన గార్లిక్ బ్రెడ్ ను వెన్నతో కోట్ చేసి ముక్కలుగా కట్ చేసుకుంటే గార్లిక్ బ్రెడ్ రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News