MoviesTollywood news in telugu

Nagarjuna: వరుస ప్లాప్ ల తర్వాత బ్రేక్ ఇచ్చిన సినిమా ఇదే..

Tollywood hero nagarjuna Movie : అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున చాలా తక్కువ సమయంలోనే తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. సినిమా ఇండస్ట్రీ లో హిట్స్ ప్లాప్స్ సహజం. ఒక్కోసారి వరుస హిట్స్ వచ్చినట్లే మరోసారి వరుసగా ప్లాప్ లు వెంటాడతాయి. అలాంటి సమయంలో మంచి బ్రేక్ కోసం ఎన్నో ప్రయోగాలు చేస్తారు.

ఎలాగైనా హిట్ కొట్టాలని కొత్తదనం వైపు అడుగులు వేసి సక్సెస్ సాధిస్తారు. అక్కినేని నట వారసుడు అక్కినేని నాగార్జున ఇండస్ట్రీలో విభిన్న పాత్రలతో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఒక దశలో వరుసగా సినిమాలన్నీ డిజాస్టర్ అవుతుంటే, ఏ కోదండ రామిరెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ప్రెసిడెంట్ గారి పెళ్ళాం మూవీ మంచి బ్రేక్ ఇచ్చింది.

7 సినిమాల తర్వాత మళ్ళీ హిట్ కొట్టి కాసుల వర్షం కురిపించాడు. వి దొరస్వామి రాజు నిర్మించిన ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి మంచి పాటలు అందించారు. మీనా హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ మధ్య కూడా నాగ్ కొన్ని ప్లాప్ లు చూసాడు. 60ప్లస్ లో కూడా యంగ్ హీరోలకు ధీటుగా ఈ టాలీవుడ్ మన్మధుడు దూసుకెళ్తున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."