MoviesTollywood news in telugu

Chiranjeevi Dupe: మూడు దశాబ్దాలకు పైగా చిరంజీవికి డూప్‌గా నటించిన వ్యక్తి ఎవరో తెలుసా…?

Megastar Chiranjeevi Dupe : మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మరోసారి తన స్టామినా ఏమిటో చెప్పకనే చెప్పాడు. అయితే ఈ మధ్య విడుదల అయినా ‘భోళా శంకర్’తో తన కెరీర్‌లోనే అతి పెద్ద డిజాస్టర్ అయింది.

టాలీవుడ్ లో హీరోలు రిస్క్ షాట్స్ చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలను తీసుకుంటారు. అప్పటి ఎన్టీఆర్ నుంచి ఇప్పటి యంగ్ హీరోల వరకూ చాలామంది కొన్ని కీలక సన్నివేశాల్లో, మరీ ముఖ్యంగా రిస్క్ సన్నివేశాల్లో డూప్ లను వాడుతూ ఉంటారు. ఇక బాగ్ టు బాస్ అంటూ 9ఏళ్ళ విరామం తర్వాత మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చి, 60ప్లస్ లో కూడా దుమ్మురేపుతూ వరుస సినిమాలతో బిజీగా మారిన మెగాస్టార్ చిరంజీవికి కూడా చాలా సినిమాల్లో డూప్ లను వాడారు.
chiru dupe
ఇటీవల సోషల్ మీడియా విస్తృతి కారణంగా డూప్ ల గురించి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి ఇటీవల ఓ షో లో ఇచ్చిన ఇంటర్యూలో మెగాస్టార్ కి తాను డూప్ గా చేసిన విషయాన్ని వెల్లడించడంతో అందరూ షాకయ్యారు. ఈటివి ఎంటర్టైన్ మెంట్ ఛానల్ లో శ్రీదేవి డ్రామా కంపెనీ పేరిట షో ప్రారంభించి ఆయా ప్రాంతాల్లో టాలెంట్ బయటకు తీస్తున్నారు.
chiranjeevi
ఇదే క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వెళ్లిన టీమ్ దగ్గరకు చిరంజీవి డూప్ వచ్చాడు. తన పేరు ప్రేమ్ కుమార్ అని, తనది మార్టేరు అని, మూడు దశాబ్దాలుగా చిరుకి డూప్ గా చేస్తున్నట్లు చెప్పాడు. అన్ని సినిమాలకు కాకుండా అవసరమైన వాటికే పిలుస్తారని తెల్పాడు. రికార్డింగ్ డాన్స్ ట్రూప్ కూడా తనకు ఉందని, అయితే రికార్డింగ్ డాన్స్ లంటే చిన్నచూపు ఉందని వాపోయాడు. ఇలాంటి షోస్ తో తమలాంటి వారికి గుర్తింపు లభిస్తుందన్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."