Kara Bath Recipe:బెంగుళూరు స్పెషల్ కారా బాత్ మరియు జారుడు చట్నీ ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు
Kara Bath with Neer Chutney: బొంబాయి రవ్వలో కూరగాయలు యాడ్ చేసి జారుగా నీర్ చట్నీ కాంబినేషన్.. ఎప్పుడైన టేస్ట్ చేసారా.కర్ణాటక స్టైల్ కార బాత్ నీర్ చట్నీ ఎలా తయారు చెయాలో చూసేయండి.
కావాల్సిన పదార్ధాలు
కారా బాత్ కోసం..
రవ్వ – 1 కప్పు
నెయ్యి – 3-4 టేబుల్ స్పూన్స్
నూనె – 2 టేబుల్ స్పూన్స్
ఆవాలు – 1 టేబుల్ స్పూన్
శనగపప్పు – ½ టేబుల్ స్పూన్
జీలకర్ర – ½ టేబుల్ స్పూన్
కరివేపాకు – 2 రెమ్మలు
అల్లం తురుము – 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి – 2
ఉల్లిపాయలు – 1 కప్పు
ఉప్పు – తగినంత
క్యారట్ తరుగు – 2 టేబుల్ స్పూన్
బీన్స్ తరుగు – 2 టేబుల్ స్పూన్
కాప్సీకం తరుగు – 2 టేబుల్ స్పూన్
బఠానీ – 2 టేబుల్ స్పూన్స్
టమాటో – ¼ కప్పు
పసుపు – ½ టేబుల్ స్పూన్
పంచదార – 1 టేబుల్ స్పూన్
కొత్తిమీర – చిన్న కట్ట
వాంగి బాత్ పొడి – 1 టేబుల్ స్పూన్
నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్
పచ్చికొబ్బరి తురుము -2 టేబుల్ స్పూన్
Neer చట్నీ..
అల్లం – 1 ఇంచ్
వెల్లుల్లి – 10-12
పచ్చిమిర్చి – 4-5
కొత్తిమీర – కొద్దిగా
పుదీనా ఆకులు -15-20
ఉప్పు – తగినంత
పుట్నాల పప్పు – 2 టేబుల్ స్పూన్స్
చింతపండు – కొద్దిగా
నీళ్లు – 300 ml
పచ్చికొబ్బరి – 200 గ్రాములు
నీరు చట్నీ తాలింపు కోసం..
నూనె – 1 ½ టేబుల్ స్పూన్
ఆవాలు – ½ టేబుల్ స్పూన్
శనగపప్పు- 1 టేబుల్ స్పూన్
జీలకర్ర – ½ టేబుల్ స్పూన్
ఎండుమిర్చి – 2
ఇంగువ – 2 చిటికెలు
కరివేపాకు – 2 రెమ్మలు
తయారీ విధానం
1.కారా బాత్ కోసం నూనె,నెయ్యి వేడి చేసి అందులో ఆవాలు,శనగపప్పు,జీలకర్ర కరివేపాకు వేసి వేపుకోవాలి.
2.వేగిన తాలింపులో అల్లం తురుము ,పచ్చిమిర్చి,ఉల్లిపాయ తరుగు,ఉప్పు వేసి మెత్తపడే వరకు వేపుకోవాలి.
3.వేగిన ఉల్లిపాయల్లోకి కాప్సికం,క్యారట్,బీన్స్,బఠాని వేసి మూడు నిమిషాలపాటు వేపుకోవాలి.
4.వేగిన కూరగాయల్లో రవ్వ వేసి సన్నని సెగ పై వేపుకోవాలి.
5.రవ్వ వేగాక అందులోకి టమాట ముక్కలు వేసి కాసేపు వేపి..అందులో వేడి నీళ్లు,పసుపు,పంచదార వేసి కలిపి దగ్గరపడనివ్వాలి.
6.రవ్వ దగ్గర పడ్డాక వాంగీ బాత్ పొడి చల్లి కొత్తిమీర తరుగు వేసి ,పైన నెయ్యి వేసి మరో మూడు నిమిషాలు ఉడకనివ్వాలి.
7.రవ్వ దగ్గర పడ్డాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కదపకుండా మూత పెట్టి మరో మూడు ,నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్ పై మగ్గనివ్వాలి.
8.చివరగా స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం కొత్తిమీర తరుగు ,పచ్చి కొబ్బరి తురుము చల్లి కలిపుకోవాలి.
9.చట్నీ కోసం ఉంచిన పదార్ధాలన్ని మిక్సి జార్ లో వేసి కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకోని మెత్తని పేస్ట్ ల చేసుకోవాలి.
10.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని ఆయిల్ వేడి చేసి తాలింపు వేపుకోని వేగిన తాలింపును చట్నీలో కలుపుకోవాలి.
11.కార బాత్ ను ప్లేట్ లో మద్యలో పెట్టి ,చుట్టు చట్నీ వేసి సర్వ్ చేసుకోవాలి.
Click Here To Follow Chaipakodi On Google News

