Cauliflower Senagapappu Curry: కాలీ ఫ్లవర్ సెనగపప్పు కూర ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు
Cauliflower Senagapappu Curry: కాలీ ఫ్లవర్ స్పెషల్స్ చాలా చేస్తుంటాం.గ్రేవీ కర్రీస్ కి కాలిఫ్లవర్ ది బెస్ట్ రెసిపి.కాలీ ఫ్లవర్ ,శనగపప్పు కాంబినేషన్ తో ఇలా ట్రై చేయండి.
కావాల్సిన పదార్ధాలు
కాలీఫ్లవర్ – 300 గ్రాములు
నూనె – 1 టేబుల్ స్పూన్
పసుపు – కొద్దిగా
పచ్చిశనగపప్పు – 1/4కప్పు
గ్రేవీ కోసం..
నూనె – 2 టేబుల్ స్పూన్స్
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్
పచ్చిమిర్చి – 2
ఉల్లిపాయ -1
పచ్చి కొబ్బరిపాలు – 1/4కప్పు
టమాటో – 3
ఉప్పు – తగినంత
కారం – 1 టేబుల్ స్పూన్
పసుపు – 1/4టేబుల్ స్పూన్
కూర కోసం..
జీలకర్ర – 1/2టేబుల్ స్పూన్
కరివేపాకు – 3 రెమ్మలు
నూనె – 1 టేబుల స్పూన్
నీళ్లు – 1.5 కప్పు
కొత్తిమీర – కొద్దిగా
తయారీ విధానం
1.శనగపప్పును వేడి నీళ్లలో వేసి నాన పెట్టాలి.
2.స్టవ్ పై కడాయి పెట్టుకుని, నూనె వేడి చేసి, కాలీఫ్లవర్ ముక్కలు, పసుపు వేసి 3 నిముషాలు వేపుకోవాలి.
3.కాలీఫ్లవర్ పక్కన పెట్టి, అదే కడాయిలో నూనె వేసి, జీలకర్ర, ధనియాలు,పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి వేపుకోవాలి.
4. ఉల్లిపాయ వేగిన తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు, టమాటో ముక్కలు, ఉప్పు, కారం , పసుపు, ఒక దాని తర్వాత మరొకటి వేస్తూ, మగ్గించుకోవాలి.
5. మగ్గిన ఈ మిశ్రమాన్ని, మిక్సీ జార్లోకి వేసుకుని, కొద్దిగా నీళ్లు యాడ్ చేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
6. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకుని, నూనె వేడి చేసి, జీలకర్ర, కరివేపాకు, వేసి, అవి వేగిన తర్వాత, రుబ్బుకున్న ఉల్లి, కొబ్బరి పేస్ట్, నానపెట్టిన శనగపప్పు నీళ్లు పోసి, పప్పు ఉడికేంతవరకు ఉడకనివ్వాలి.
7.ఉడికిన శనగపప్పులో, వేపుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసి, బాగా కలుపుకుని, ఉడకనివ్వాలి.
8.చివరగా కొత్తిమీర చల్లుకుని, స్టవ్ ఆఫ్ చేసుకుంటే, కర్రీ రెడీ అయినట్లే.
Click Here To Follow Chaipakodi On Google News

