Diabetes Care:షుగర్ ఉన్నవారు నిమ్మరసం తాగితే ఏమి అవుతుందో తెలుసా?
Diabetes Care And Food : డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్ నియంత్రణలో ఆహారం అనేది కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఈ మధ్య కాలంలో చిన్న వయస్సులోనే డయాబెటిస్ వచ్చేస్తుంది.
ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి పరిస్థితి కారణంగా చాలా చిన్న వయస్సులోనే డయాబెటిస్ బారిన పడుతున్నారు. డయాబెటిస్ వచ్చిందంటే జీవిత కాలం మందులు వేసుకోవలసిందే. అలా మందులను వాడుతూ కొన్ని ఆహారాలను తీసుకుంటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. అలాగే కొన్ని ఆహారాలను తినకూడదు.
మధుమేహం ఉన్నవారికి మేలు చేసే ఆహారాల్లో నిమ్మకాయ ఒకటి. నిమ్మకాయను తగిన మోతాదులో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. డయాబెటిస్ ఉన్నవారిలో రోగనిరోదక శక్తి తక్కువగా ఉంటుంది. దాంతో తరచుగా ఏదో ఒక అనారోగ్యానికి గురి అవుతూ ఉంటారు.
నిమ్మకాయలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచుతాయి.
అలాగే ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు ప్రతి రోజు ఒక స్పూన్ నిమ్మరసం తీసుకుంటే మంచిది. డయాబెటిస్ ఉన్నవారిలో జీర్ణ సమస్యలు వస్తు ఉంటాయి. ఇలా నిమ్మరసం తీసుకుంటూ ఉంటే గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు కూడా ఉండవు.
డయాబెటిస్ ఉన్నవారిలో తరచుగా అలసట,నీరసం వంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి తాగితే మంచి ప్రయోజనం కనపడుతుంది. నిమ్మకాయలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఉంటుంది. అందువల్ల భోజనం తిన్న తర్వాత రక్తంలో చక్కెర మరియు ఇన్సులిన్ స్థాయిలను తగ్గిస్తుంది.
డయాబెటిస్ ఉన్నావృలో విటమిన్ సి తక్కువ స్థాయిలో ఉంటుంది. అందువల్ల నిమ్మరసం తీసుకుంటే విటమిన్ సి కొంతవరకు భర్తీ అవుతుంది.
డయాబెటిస్ ఉన్నవారు తప్పనిసరిగా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్ విషయంలో ఆహారం కీలకమైన పాత్రను పోషిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు మందులు వాడుతూ ఇలాంటి ఆహారాలను తీసుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News

