Beauty Tips

Skin Care Tips:వేప పొడిలో ఇది కలిపి రాస్తే.. నలుపు తగ్గి, ముఖం తెల్లగా మెరుస్తుంది..!

Neem Powder And Rose Water Face Pack: ముఖం తెల్లగా అందంగా ఉండాలని ఎన్నో రకాల ఉత్పత్తులను వాడుతూ ఉంటాం. వాటి కారణంగా కొన్ని సార్లు చర్మం నిస్తేజంగా కనిపిస్తుంది. దాంతో ఖరీదైన చికిత్సలు తీసుకుంటాం.

కానీ ఇప్పుడు ఎలాంటి చికిత్స తీసుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పే ఫేస్ ప్యాక్‌ మీ చర్మంను క్లియర్‌గా మరియు మెరిసేలా చేస్తుంది. ఈ ప్యాక్ లో కేవలం నాలుగు ఇంగ్రిడియన్స్ వాడుతున్నాం.

ఒక బౌల్ లో ఒక స్పూన్ ముల్తానీ మిట్టి పొడి, అరస్పూన్ వేప పొడి, అరస్పూన్ గంధపు పొడి, ఒక స్పూన్ రోజ్ water, సరిపడా నీటిని పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 5 నిమిషాల తర్వాత నీటిని జల్లుతూ రబ్ చేస్తూ ముఖాన్ని శుభ్రంగా కడగాలి.

ఆ తర్వాత ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇది చర్మంపై ఉన్న అదనపు నూనెను తొలగిస్తుంది. దీంతో చర్మం ఈవెన్ టోన్‌గా కనిపిస్తుంది. చర్మంపై ఉన్న మురికి సులభంగా తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

ఈ ప్యాక్ వేసుకోవటం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అన్ని ఇంగ్రిడియన్స్ మనకు చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి. అలాగే చాలా తక్కువ ఖర్చులో ముఖ్నాన్ని తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News

https://www.chaipakodi.com/

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."