Beauty Tips

Green tea for Beauty :Green tea తో కలిపి ఇలా చేస్తే ముఖం మీద ముడతలు అన్నీ మాయం

Green tea for Beauty :Green tea తో కలిపి ఇలా చేస్తే ముఖం మీద ముడతలు అన్నీ మాయం.. మనలో చాలామందికి చర్మం సున్నితంగా ఉండటం వలన తొందరగా ముడతలు వచ్చేస్తు ఉంటాయి.

చిన్న వయసులోనే ముడతలు రావటం వలన చిన్న వయస్సులోనే పెద్దవారిగా కనబడుతుంటారు. ముడతలను తొలగించుకోవటానికి యాంటీఏజింగ్ క్రీములు వాడాల్సిన అవసరం లేదు మన ఇంటి చిట్కాల ద్వారా చాలా సులభంగా తగ్గించు కోవచ్చు. అలాగే ముఖం మీద పేరుకుపోయిన మురికి కూడా తొలగిపోయి ముఖం కాంతివంతంగా కనబడుతుంది.

దీనికోసం గ్రీన్ టీ ఉపయోగిస్తున్నాం. గ్రీన్ టీ లో యాంటీ ఏజింగ్ లక్షణాలు యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి ముడతలను తగ్గిస్తుంది.

గ్రీన్ టీ ని మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి ఒక స్పూన్ పొడిలో ఒక స్పూన్ పెరుగు వేసి మెత్తని పేస్ట్ గా తయారు చేసుకోవాలి ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి 2 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. అరగంటయ్యాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే ముడతలు అన్ని మాయం అవుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."