Movies

Tholi Prema Actress Vasuki :తొలిప్రేమలో పవన్ సోదరి వాసుకి ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

Tholi Prema Actress Vasuki:కొన్ని సినిమాలు చిరకాలం గుర్తిండిపోతాయి. మరికొన్ని సినిమాల్లో పాత్రలు ఎప్పటికీ మరువలేం. అలాంటి మంచి చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ చిత్రం ఒకటి. ఇది అందరిపై తీవ్ర ప్రభావం చూపింది. ఇక ఆ మూవీలోని పాత్రలు,పాటలు అందరికీ గుర్తొచ్చేలా చేస్తాయి. అయితే పవన్ కళ్యాణ్ సోదరి గా నటించి,మెప్పించిన వాసుకి కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది.అల్లరి పిల్లగా ఆ సినిమాలో చేసిన నటన హైలెట్. నిజానికి ఆ సినిమా తర్వాత ఆమె మూవీస్ ఏమీ చేయలేదు. ఇక అదే చిత్రంలో పరిచయం అయిన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయిని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. తొలిప్రేమ షూటింగ్ లో పవన్,ఆనంద్ సాయి తనను ఆటపట్టించేవారని వాసుకి తెల్పింది.

ఆనంద్ సాయితో ప్రేమ విషయాన్ని వాసుకి వివరిస్తూ,’తొలిప్రేమ షూటింగ్ సమయంలోనే నాకు,ఆనంద్ సాయికి మధ్య ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. సరదాగా మాట్లాడుకుంటూనే స్నేహితులుగా మారిపోయాం. సినిమా షూటింగ్ ముగిశాక గంటల తరబడి ఫోన్ లో మాట్లాడుకునేవాళ్ళం. సరదా విషయాలతో పాటు సినీ సంగతులు కూడా ఆనంద్ చెప్పేవాడు.

అయితే అందరిలా ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేయకుండా నేరుగా పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. అయితే సడన్ గా పెళ్లి ప్రస్తావన తేవడంతో అప్పటికి ఆటను నన్ను ప్రేమిస్తున్నాడని అసలు అనుకోలేదు. అసలు ఆ ఉద్దేశ్యంతో మాట్లాడుతున్నాడని కనిపెట్టలేకపోయాను. నాకు ఆ ఉద్దేశ్యం లేదని చెప్పేసాను’అని వివరించింది.

అయితే సడన్ గా ఆనంద్ ఫోన్ చేయడం మానేసాడు. ప్రతిరోజూ ఫోన్ లో మాట్లాడే వ్యక్తి సడన్ గా మానెయ్యడంతో తానే ఫోన్ చేశానని, ఎందుకు ఫోన్ చేయలేదని అడిగానని వాసుకి ఆనాటి విషయాలను నెమరువేసుకుంది. పెళ్లి ప్రస్తావన వచ్చాక ఫ్రెండ్ గా ఉండలేనని ఆనంద్ సాయి చెప్పాడని,అలా 15రోజులు మాటలు లేవని చెప్పింది.

ఇలా ఎక్కువ రోజులు ఆనంద్ తో మాట్లాడకపోయేసరికి అతన్ని మిస్ అవుతున్నానని ఫీలయ్యాను. ఇక ఫ్రెండ్స్ కి విషయం చెప్పడంతో పెళ్ళికి ఒకే చెప్పెయ్య మ్మన్నారని, దీంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసానని,అలా ఇద్దరం ఒక్కటయ్యామని వివరించింది. ఇప్పుడు వాళ్లిద్దరూ హ్యాపీగానే ఉన్నారు.

మళ్లీ రెండు దశాబ్దాల విరామం తర్వాత ’అన్నీ మంచి శకునములే’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈటీవీ విన్‌లో స్ట్రీమ్‌ అవుతోన్న ’#90s: ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’ వెబ్‌సిరీస్‌తో మిడిల్‌ క్లాస్‌ అమ్మగా ఆకట్టుకుంటోంది. ఇందులో కనిపించే వస్తువులు, చిన్నచిన్న ఆనందాలు, విషయాలు, పరిస్థితులు.. నైంటీస్‌ కిడ్స్‌కి బాగా రిలేట్‌ అవుతున్నాయి.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."