Beauty Tips

Almond oil For Face::బాదంనూనెలో ఇవి క‌లిపి రాస్తే.. మెరిసే చ‌ర్మం మీసొంతం?

Almond Oil and lemon face glow Benefits : ముఖ సంరక్షణలో మన ఇంటిలో ఉన్న వస్తువులు ఎంతగానో సహాయపడతాయి. కాస్త ఓపికగా చేసుకుంటే సరిపోతుంది.

ఈ రోజుల్లో ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. దానికోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉంటారు. అయితే పెద్దగా ఖర్చు పెట్టకుండా ఇంటి చిట్కాలతో మచ్చలు లేని మెరిసే చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. అయితే కాస్త ఓపికగా ఫాలో అవ్వాలి.

చర్మ సమస్యలను తగ్గించడంలో బాదం నూనె చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బాదం నూనెలో విటమిన్ ఇ మరియు యాంటీఆక్సిడెంట్ సమృద్దిగా ఉండుట వలన చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా చేస్తుంది. అంతేకాక ఆరోగ్యంగా ఉంచుతుంది. బాదం నూనె చాలా సులువుగానే లభ్యం అవుతుంది.

మొటిమల సమస్య ఉన్నవారు ఈ చిట్కాను ఫాలో అవ్వండి. ఈ చిట్కా కోసం కేవలం 2 ఇంగ్రిడియంట్స్ సరిపోతాయి. ఒక స్పూన్ బాదం నూనెలో అర స్పూన్ తేనె కలిపి మొటిమలు ఉన్న ప్రదేశంలో రాసి పది నిమిషాలయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా నాలుగు రోజులపాటు చేస్తే మొటిమలు అన్ని మాయమవుతాయి.

మరో ప్యాక్ గురించి కూడా తెలుసుకుందాం. 1 స్పూన్ బాదం నూనె అరస్పూను నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంటయ్యాక గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖం పై ఉన్న మృతకణాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది.

బాదం నూనెలో పాలు కలిపి ముఖానికి రాసి అరగంటయ్యాక నార్మల్ వాటర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం మీద ఉన్న నలుపు అంతా తొలగిపోతుంది. బాదం నూనె,పాలలో ఉన్న లక్షణాలు ముఖం తెల్లగా కాంతివంతంగా మెరవటానికి సహాయపడతాయి. ఈ చిట్కాలు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. మీరు ట్రై చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."