DevotionalToday Rasi Phalalu In telugu

Rasi Phalalu:November 23 రాశి ఫలాలు-ఈ రాశి వారికి కలహాలు ఎక్కువగా వస్తాయి

November 23 Rasi Phalalu in Telugu : జాతకాలను గుడ్డిగా నమ్మకుండా కొంత వరకు నమ్మవచ్చు. ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది జాతకాలను ఎక్కువగా నమ్ముతున్నారు. జాతకాలను నమ్ముతూ ప్రతి రోజు రాశి ఫలాలను చూసుకుంటూ వాటికీ అనుగుణంగా అడుగులు వేస్తూ ఉంటారు.

మేషరాశి
ఈ రాశి వారు చేసే పనిలో ముందుచూపుతో వ్యవహరిస్తే ఆటంకాలు ఏమీ ఉండవు. కీలకమైన పనులను ప్రారంభించే ముందు కొన్ని అంచనాలను వేసుకోవాలి. జాగ్రత్తగా లేకపోతే కలహాలు వచ్చే అవకాశం ఉంది.

వృషభ రాశి
ఈ రాశి వారు భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. డబ్బు విషయంలో లోటు ఉండదు.కలహాలు లేకుండా జాగ్రత్తగా ఉండాలి.

మిధున రాశి
ప్రారంభించిన పనులలో ఆటంకాలను అధిగమిస్తారు. ప్రతిభకు తగ్గట్టుగా ప్రశంసలు దక్కుతాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు.

కర్కాటక రాశి
ఈ రాశి వారు కీలకమైన పనులను ప్రారంభిస్తారు, మొహమాటం కారణంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను తప్పనిసరిగా పాటించాలి. కలహాలు లేకుండా చూసుకుంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది.

సింహరాశి
ఈ రాశి వారికి కొన్ని పరిస్థితులు నిరుత్సాహాన్ని కలిగిస్తాయి. కొద్దిగా గతంలో చేసిన పొరపాట్లు ఇబ్బంది పెడతాయి. కలహాలు వచ్చే అవకాశం ఉంది.

కన్య రాశి
ఈ రాశి వారు కుటుంబ సభ్యుల సలహాతో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారం కలిసొస్తుంది. అదృష్ట యోగం ఉంది.

తులారాశి
అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. తోటి వారి సహకారంతో పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని ఎదుర్కొంటారు.

వృశ్చిక రాశి
కీలకమైన విషయాలలో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కలహాలకు దూరంగా ఉండాలి. నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాలి.

ధనస్సు రాశి
కీలకమైన వ్యవహారాలలో శ్రద్ధగా ముందుకు సాగాలి. ముఖ్యమైన వ్యవహారాలలో బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.

మకర రాశి
ఈ రాశి వారు చేసే ప్రతి పని విజయవంతంగా ముగుస్తుంది. ఖర్చులు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి.

కుంభరాశి
ఈ రాశి వారిని పట్టుదలే ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. పక్కన ఉన్న వారి సలహాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.

మీన రాశి
ఈ రాశివారు కాస్త జాగ్రత్తగా ఉంటె ఆశించిన ఫలితాలు వస్తాయి. చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u