Beauty Tips

Skin Glow Tips:ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే మేకప్ అక్కర్లేదు.. న్యాచురల్ గానే మెరిసిపోతారు

skin Glow Tips:ముఖం అందంగా తెల్లగా మెరవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం వేల కొద్ది డబ్భును ఖర్చు చేస్తూ బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయినా పెద్దగా ప్రయోజనం ఉండదు.

అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా చాలా తక్కువ ఖర్చులో ముఖం మీద మచ్చలు లేకుండా మెరిసేలా చేసుకోవచ్చు.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ బీట్ రూట్ పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ వేపాకుల పౌడర్, పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి( Multani Mitti ), హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, సరిపడా రోజ్‌ వాటర్ వేసుకుని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే సరిపోతుంది. ఈ రెమెడీని పాటిస్తే మేకప్ పై ఆధారపడాల్సిన అవసరమే ఉండదు.

బీట్ రూట్ పొడిలో ఉన్న లక్షణాలు చర్మ ఛాయను మెరుగు పరుస్తాయి. వేపాకుల పొడి, పసుపులో ఉన్న లక్షణాలు మొండి మొటిమలు,మచ్చలను మాయం చేస్తాయి. ముల్తానీ మట్టి చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. కాబట్టి ఈ ప్యాక్ వేయటానికి ప్రయత్నం చేయండి.

ఈ ప్యాక్ లో వాడిన బీట్ రూట్ పొడి,వేప పొడి,పసుపు, ముల్తానీ మట్టి, విటమిన్ E oil, రోజ్ water.. వీటిలో ఉన్న పోషకాలు చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."