Smoothie :వారంలో 2 సార్లు ఈ స్మూతీ డైట్‌లో ఉంటే…ముఖ్యంగా గర్భధారణ సమయంలో…
strawberry banana smoothie Benefits in telugu : మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పాషకాహారం తీసుకోవాలి. పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. మనలో చాలా మంది కడుపు నిండా ఏదో ఆహారం తీసుకున్నాం కదా అని అనుకుంటారు. .

కానీ పోషకాలు గురించి పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు చెప్పే smoothie ని వారంలో రెండుసార్లు తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ smoothie ని ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం. ఒక అరటిపండు తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత 4 స్ట్రాబెర్రీలను తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

మిక్సీ జార్ లో అరటిపండు ముక్కలు, స్ట్రాబెర్రీ ముక్కలు, ఒక స్పూన్ పెరుగు, ఒక కప్పు బాదం పాలు, రెండు టేబుల్ స్పూన్ల తేనె, ఆరు బ్లూ బెర్రీస్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఎన్నో పోషకాలు ఉన్న ఆరోగ్యకరమైన smoothie రెడీ అయినట్టే. ఈ smoothie ని వారంలో రెండుసార్లు తీసుకుంటే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.

సీజన్ మారినప్పుడు వచ్చే అన్ని రకాల సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడే వారికి మంచి ఉపశమనం కలుగుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉండి రక్త సరఫరా బాగా సాగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మన ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. కాస్త ఓపిక సమయాన్ని కేటాయిస్తే చాలా మంచి ప్రయోజనాలను పొందవచ్చు.

అరటిపండులో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన ప్రేగు ఆరోగ్యాన్ని కాపాడి జీర్ణక్రియను నియంత్రించడంలో సహాయపడుతుంది. అరటిపండ్లలో ఉండే పొటాషియం కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఉదయం సమయంలో తీసుకుంటే అలసట,నీరసం లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు.

స్ట్రాబెర్రీలు మంచి కంటిచూపును ప్రోత్సహిస్తాయి. అధిక పరిమాణంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండుట వలన ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గిస్తాయి. అలాగే పోలేట్ సమృద్దిగా ఉండుట వలన స్ట్రాబెర్రీ బనానా స్మూతీ గర్భిణీ స్త్రీలకు మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఫోలేట్ వెన్నెముక యొక్క పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

