Coconut Rice: రాత్రి మిగిలిన అన్నంతో కొబ్బరి పాలతో 10ని||ల్లో రుచిగా చేసే కొబ్బరి పులావ్..
Coconut Rice: రాత్రి మిగిలిన అన్నంతో కేవలం 10 నిమిషాల్లో.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా ఇలా చేసుకోండి..మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చెయ్యాలంటే పెద్ద టాస్క్. ఫుడ్ టేస్టీగా ఉండాలి,ఈజీగా అయిపోవాలి. అందుకే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కొబ్బరి అన్నం చేసేయండి. చిటికెలో తయారుచేసుకోవొచ్చు.
కావాల్సిన పదార్ధాలు
ఉడికించిన అన్నం – 2 కప్పులు
కొబ్బరి – ½ కప్పు
నెయ్యి – 2 టీ స్పూన్
శనగపప్పు – 2 టీ స్పూన్స్
మినపప్పు – 2 టేబుల్ స్పూన్స్
జీడిపప్పు – 10-12
పచ్చిమిర్చి – 3-4
కరివేపాకు – 2 రెమ్మలు
ఉప్పు – రుచికి సరిపడా
కొత్తిమీర –కొద్దిగా
తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నెయ్యి వేసి కరిగించాలి.
2.అందులోకి శనగపప్పు,మినపప్పు,జీలకర్ర,ఆవాలు,ఎండుమిర్చి వేసి వేపుకోవాలి.
3.తర్వాత జీడిపప్పు,పచ్చిమిర్చి చీలికలు,రెండు రెమ్మల కరివేపాకు వేసి వేపుకోవాలి.
4.తాలింపు వేగాక తగినంత ఉప్పుడు యాడ్ చేసుకోవాలి.
5.వేగిన తాలింపులోకి ఉడికించిన అన్నం వేసుకోని కలుపుకోవాలి.
6.కొబ్బరితురుము వేసి అన్నంలో కలిసేట్టుగా బాగా కలుపుకోని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కొబ్బరి అన్నం రెడీ.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

