Beauty Tips

Cracked Foot : చలికాలంలో మీ పాదాలు పగులుతున్నాయా.. ఈ చిట్కాలతో చెక్ పెట్టండి..!

cracked Heels Home Remedies: చలికాలం వచ్చిందంటే చాలు పాదాల పగుళ్లు మొదలు అవుతాయి. పొలుసులు రాలుతూ బరుకుగా తయారవుతాయి. ఆ పగుళ్లని నిర్లక్ష్యం చేస్తే రక్తస్రావం అయ్యి సమస్య ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. అందువల్ల కాళ్ల పగుళ్లు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం. .

ఈ చలికాలంలో పాదాల పగుళ్ళ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. పాదాల పగుళ్ళ సమస్య ఉన్నప్పుడు అసలు అశ్రద్ద చేయకూడదు. పాదాలు పగుళ్లు ఉన్నప్పుడు దుమ్ము,ధూళి చేరి సమస్య మరింతగా పెరిగి నడవటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది.

పాదాల పగుళ్లను తగ్గించుకోవటానికి ఖరీదైన క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. మన ఇంటిలో దొరికే సహజసిద్దమైన పదార్ధాలతో సులభంగా పాదాల పగుళ్లను తగ్గించుకోవచ్చు. ఒక బౌల్ లో ఒక స్పూన్ నెయ్యి, రెండు కర్పూరం బిళ్లలను పొడిగా చేసి వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని పాదాలు పగుళ్లు ఉన్న ప్రదేశంలో రాసి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు చేస్తూ ఉంటే పాదాల పగుళ్లు క్రమంగా తగ్గిపోతాయి.

పాదాలలో కోల్పోయిన తేమ వచ్చేలా చేసి పాదాలు పొడిగా లేకుండా చేస్తుంది. పాదాలు పొడిగా మారితే కూడా పాదాల పగుళ్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పాదాలు తేమగా ఉండేలా చూసుకోవాలి. కర్పూరంలో ఉన్న లక్షణాలు ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడతాయి. ఈ రెండు ఇంగ్రిడియన్స్ మనకు చాలా సులభంగా ఇంటిలో లభ్యం అవుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."