White Hair Turn Black:నిమ్మరసంలో కలపి రాసుకోండి చాలు.. తెల్లజుట్టు నల్లగా మారుతుంది
White Hair Turn Black:వయసు పెరిగేకొద్ది తెల్లజుట్టు రావడం కామన్. చాలామంది వృద్దాప్యానికి సూచికగా తెల్లజుట్టును పరిగణలోకి తీసుకుంటారు. కానీ నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా తెల్లజుట్టుతో ఇబ్బంది పడుతున్నవారు ఉన్నారు. చిన్న వయసులోనే తెల్లజుట్టు రావడం వల్ల ఉండాల్సిన వయసు కంటే పెద్దగా కనబడుతుంటారు.
పైగా తెల్లజుట్టును కవర్ చేయడానికి రసాయనాలున్న హెయిర్ డైలు, షాంపూలు, హెయిర్ మాస్క్ లు వాడుతూ జుట్టును మరింత పాడు చేసుకుంటున్నారు.
తెల్లజుట్టు కనపడగానే మనలో ప్రతి ఒక్కరూ చాలా కంగారు పడిపోతూ ఉంటారు. అలా కంగారు పడవలసిన అవసరం అసలు లేదు. అంతేకాకుండా మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడవలసిన అవసరం కూడా లేదు.
మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. కాస్త శ్రద్ద,సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.
ఒక బౌల్ లో మూడు స్పూన్ల కొబ్బరి నూనె, రెండు స్పూన్ల నిమ్మరసం కలిపి జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి అరగంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.
కొబ్బరి నూనె, నిమ్మరసం రెండు కూడా తెల్లజుట్టును నల్లగా మార్చటంలో సహాయపడతాయి. కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ మరియు యాంటీమైక్రోబయల్ ఎఫెక్ట్స్,యాంటీఆక్సిడెంట్ సమృద్దిగా ఉండుట వలన స్కాల్ప్‌ను కండిషన్ చేయటమే కాకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుతుంది.
నిమ్మరసంలో భాస్వరం మరియు విటమిన్లు B మరియు C ఉండుట వలన తెల్లజుట్టును నల్లగా మార్చుతుంది. అలాగే జుట్టు కుడుళ్ళను బలంగా మార్చటంలో కూడా బాగా సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ