DevotionalToday Rasi Phalalu In telugu

Shani Dev 2025:శని దేవుడు ఈ రాశుల వారిని కుబేరులను చేస్తాడు….ఆ రాశుల్లో మీ రాశి ఉందేమో…

Shani Dev 2025 : మనలో చాలా మంది జాతకాలను నమ్ముతూ ఉంటారు. కొంత మందికి జాతకం మీద నమ్మకం ఉండదు. అయితే నమ్మకం ఉన్నవారు వారి జాతకం ఎలా ఉందో తెలుసుకోవటానికి జ్యోతిష్య పండితులను కలుస్తూ ఉంటారు. ప్రతి వ్యక్తి జాతకంలోనూ శని ప్రభావం ఉంటుంది. మందగమనం కలిగి ఉండుట వలన శనైశ్చరుడు అని కూడా అంటారు.

నవగ్రహాల్లో అతి శక్తివంతుడు అయినా శని వాహనం కాకి. మకర,కుంభ రాశులకు అధిపతి శని. శనిదేవుని భార్య జేష్టా దేవి. శనివారం,త్రయోదశి కలిసి వస్తే శని త్రయోదశి అని అంటారు. ఈ రోజు శనికి ప్రతీకరమైన రోజు. ఈ రోజు శనికి తైలాభిషేకాలు చేస్తారు. శని ప్రతి రాశిలోను రెండున్నర సంవత్సరాలు సంచారం చేస్తాడు. అంటే మొత్తం సంచారం పూర్తి కావటానికి 30 సంవత్సరాలు పడుతుంది.

అంటే ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి ప్రతి ఒక్కరిపై శని ప్రభావం ఉంటుంది. శని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అందువల్ల శని ప్రభావం నుండి తప్పించుకోవటానికి ఎన్నో పూజలను చేస్తూ ఉంటారు. శని అనుగ్రహానికి కూడా పూజలు చేస్తూ ఉంటారు. శని సంక్రాంతి నుండి ఈ మూడు రాశుల్లోకి ప్రవేశిస్తున్నాడట. సంక్రాతి నుండి శని ధనస్సు రాశిలోకి ప్రవేశించుట వలన మేష రాశి,సింహ రాశిలో ఉన్న శని పోతుందట.

దాంతో మేష రాశి,సింహ రాశి వారికి శని నుండి విముక్తి లభిస్తుంది. ఆ రాశులవారు పడుతున్న కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. తులా రాశి వారికి ఉన్న దరిద్రం కూడా తొలగిపోయి అదృష్టం కలుగుతుంది. మేష రాశి ,సింహ రాసి,తులా రాశివారికి అనుకున్న పనులు నెరవేరతాయి. ధన లాభం కలుగుతుంది. ఇంటిలో అంతా సంతోషంగా ఉంటారు. అలాగే మరో వైపు వృషభ రాశి,కన్యా రాశి వారిపై శని ప్రభావం ఎక్కువగా ఉండి ఎన్నో సమస్యలకు కారణం అవుతుంది.

మకర రాశి వారికి అయితే విపరీతమైన సమస్యలు ఉంటాయట. ఈ రాశుల వారు శని నుండి తప్పించుకోవాలంటే ప్రతి శనివారం శివాలయానికి వెళ్లి శనిదేవుని మందిరంలో నువ్వులను సమర్పించాలి. నువ్వులనూనెతో అభిషేకం చేయాలట. అంతేకాక పేదవారికి అన్నదానం చేస్తే శనిదేవుడు ప్రసన్నం అవుతాడట. కాబట్టి మీ రాశి ఏమిటో తెలుసుకొని శని ప్రభావము ఉందా లేదా అని తెలుసుకొని దానికి తగ్గట్టుగా పరిహారాలు చేసుకొని శనిని ప్రసన్నం చేసుకోండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ