Tula Rasi 2025 Telugu:తులారాశి వారు ఈ పనులు చేస్తే అష్ట కష్టాలు పడతారు… ఆ పనులు ఏమిటో..
Tula Rasi 2025 Telugu:ఒకోరాశివారికి ఒక్కోసారి మంచి ఫలితాలను ఇస్తే, ఇంకోసారి చెడుఫలితాలను చూపిస్తాయి. కొందరికి ఎల్లవేళలా మంచి ఫలితాలను అందిస్తాయి. ఇక కొందరైతే కొన్ని పనులు చేస్తుంటే కల్సి రావు. అలాంటి వాళ్ళు వాటిజోలికి పోకుండా ఉండడమే ఉత్తమం. అదేరీతిలో తులారాశిలో పుట్టినవాళ్ళు ఫర్నిచర్ సంబంధిత వ్యాపారాలు చేస్తే ఆకస్మిక ధన నష్టాలు వస్తాయి. కనీసం చెక్కతో చేసిన వాటిని కూడా ఎవరికీ దానంగా ఇవ్వకూడదు. ఎందుకంటే ఇలా ఇస్తే, అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. సహజంగా సౌమ్యులుగా ఈ రాశివారున్నప్పటికీ అప్పుడప్పుడు కోపాన్ని అదుపుచేసుకోలేక చిన్నచిన్న ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.
ఈ రాశివారు సహజంగా జన్మ రంగు తెలుపు. తెలుపు రంగు దుస్తులు ధరిస్తే,శాంతిని పొందుతారు. ఇక వీరు దక్షిణ భాగం గల గృహంలో నివసిస్తే, ఆ గృహంలో ఎప్పుడూ చాలా అశాంతి నిండి ఉంటుంది. అంతేకాదు, ఎప్పుడూ ఎవరో ఒకరికి ఆ ఇంట్లో ఆనారోగ్యం వస్తూనే ఉంటుంది. రావాల్సిన ధనం అందక, ఇబ్బందుల పాలవుతారు.
అమ్మవారి వెండి విగ్రహాన్ని అంటే దుర్గాదేవి విగ్రహం లాంటింది ఇంట్లో వాయువ్య దిశలో పెట్టుకుంటే చాలా మనశాంతి లభిస్తుంది. వాయువ్య , తూర్పు దిశల్లో బరువులు పెట్టకూడదు. ఒకవేళ అలా పెడితే, దాని ప్రభావం ఆర్ధిక స్థితి మీద పడుతుంది. రావాల్సిన ధనం రాదు. అప్పులపాలవుతారు.
బట్టలు, పాలు, వెండి బంగారు వ్యాపారాలు ఈ రాశివారికి బాగా కల్సి వస్తాయి. విమాన ప్రయాణాలు తగ్గించుకుంటే మంచిది. తండ్రితో ఎట్టి పరిస్థితుల్లో ఘర్షణ పడకూడదు. అలా ఘర్షణ పడితే వీరికి ఆయు క్షీణం వస్తుంది. వారానికి,15రోజులకొకసారి తండ్రి ఆశీస్సులు అందుకోవాలి. ఆగ్నేయ దిశగా తలపెట్టి పడుకోరాదు.
ఆగ్నేయ దిశగా పడుకుంటే లక్ష్మీదేవి ఆ ఇంట ఉండదు. పైగా భార్య అనారోగ్యం బారిన పడుతుంది. అందుకే తులారాశివారు తగు జాగ్రత్తలు పాటిస్తే, ఇబ్బందుల నుంచి బయట పడతారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ