Danruff Tips : ఈ ఇంటి చిట్కాతో చుండ్రు సమస్యను శాశ్వతంగా వదిలించుకోండి!
Danruff Tips : ఈ ఇంటి చిట్కాతో చుండ్రు సమస్యను శాశ్వతంగా వదిలించుకోండి.. ఈ మధ్య కాలంలో వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలే సమస్య వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ కనబడుతోంది. ఈ సమస్య రాగానే చాలా. మంది కంగారుపడి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. .
అలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా మనకు ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. కాస్త ఓపికగా శ్రద్ధగా చేసుకుంటే ఇంటి చిట్కాలు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి.
ఒక కప్పు మునగ ఆకులు తీసుకుని శుభ్రంగా కడిగి మిక్సీ జార్ లో వేసుకోవాలి. ఆ తర్వాత అర గ్లాసు మజ్జిగ లేదా పెరుగు వేసి మెత్తగా మిక్సీ చేసి స్టైనర్ సహాయంతో జ్యూస్ సెపరేట్ చేయాలి. ఈ జ్యూస్ లో రెండు స్పూన్ల బ్రింగ్ రాజ్ పౌడర్., ఒక ఎగ్ వైట్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు అప్లై చేసి అరగంట తర్వాత కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి.
ఈ విధంగా వారంలో రెండు. సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అలాగే తెల్ల వెంట్రుకలు తగ్గుతాయి. తెల్ల వెంట్రుకలు రావడం తగ్గి జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. పెరుగులో ఉండే పోషకాలు జుట్టు కాంతివంతంగా మెరవడానికి సహాయపడతాయి. .
మునగాకులో ఉండే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ చుండ్రు,దురద, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను తగ్గించి జుట్టు రాలకుండా కాపాడతాయి. ఇక బ్రింగ్ రాజ్ పొడి జుట్టు రాలకుండా చేయటమే కాకుండా తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎగ్ వైట్ లో ఉండే ప్రోటీన్ జుట్టుకు అవసరమైన పోషణను అందించి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ