Devotional

Wednesday Remedies:బుధవారం నాడు మర్చిపోయి కూడా ఈ పనులు చేయకూడదు… ఆ పనులు ఏమిటో తెలుసా?

Wednesday Remedies:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం… వారంలో ఏరోజు ఏ నిర్ణయం తీసుకుంటే సత్ఫలితాలు వస్తాయో, ఏ పనులు చేయవచ్చో, ఏవి చేయకూడదో తెలుసుకునే క్రమంలో భాగంగా బుధవారం ఏ ఏ పనులు చేయాలి, ఏవి చేయకూడదో జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. బుద్ధికి , తెలివి తేటలకు కారణమైన గ్రహం బుధుడు. అందుకే బుధవారం చాకచక్యంగా చేసే పనులు తెలివి తేటలతో చేయగల పనులు, ఆడుతూ పడుతూ చేసే పనులు చేస్తే చాలా మేలు జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెప్పేమాట.

కమ్యూనికేషన్ స్కిల్స్ చేయడానికి,ఎదుటి వ్యక్తికి ఏదైనా చెప్పాలంటే భయపడుతుంటే వాటిని బుధవారం కమ్యూనికేట్ చేస్తే చాలా మంచిదని అంటున్నారు. పెట్టుబడులు పెట్టడానికి, అధికారులతో గానీ,పెద్దలతో గానీ ఏదైనా సమస్య చెప్పాలంటే బుధవారం చాలా మంచిదని చెప్పవచ్చు.

ముఖ్యంగా చదువుకి సంబంధించి ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోడానికి, చేయడానికి కూడా బుధవారం శుభకరం అని చెప్పవచ్చు. ఆర్ధిక వ్యవహారాలకు,నూతన వ్యాపార ప్రారంభానికి ఈరోజు చాలా అనువైనది. అయితే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాలంటే మాత్రం పండితులను సంప్రదించి చేయాలి. ఎందుకంటే బుధవారం అష్టమి , అమావాస్య తిధులు వస్తే, కొన్ని పనులు కావు. ఇది గమనించి పండితుల నిర్ణయం మేరకు చేయాలి.

నరాలు, మానసిక సమస్యలు బుధవారం ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆరోజు వైద్యులను సంప్రదించడానికి , సలహాలు తీసుకోడానికి చాలా అనువైన రోజుగా చెప్పవచ్చు. మనసులోని చెడు ఆలోచనల నుంచి బయట పడ్డానికి భగవత్ ధ్యానం చేయడం,ఎదుటి వాళ్ళని మోసం చేయాలనే ఆలోచనకు స్వస్తి చెప్పడం వంటి వాటికి బుధవారం చాలా శ్రేయస్కరం.

ఇక బుధవారం నూతన ఉద్యోగంలో చేరే ప్రయత్నం చేయడం మంచిది కాదని చెప్పవచ్చు. ఇక ఆరోజు ఉత్తర దిక్కు ప్రయాణం చేయకుండా ఉంటే మంచిది. బ్యాంకు ఖాతాల ప్రారంభానికి, డబ్బు ఇచ్చిపుచ్చుకోడానికి, ఇన్సూరెన్స్ చేయడానికి బుధవారం చాలా మంచిది. మొత్తం మీద బుధవారం చాలా వరకూ మంచిరోజే అని చెప్పవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ