Beauty Tips

White Hair:తెల్లజుట్టును శాశ్వతంగా నల్లగా మార్చే ఆయుర్వేద చిట్కా

White Hair:తెల్లజుట్టును శాశ్వతంగా నల్లగా మార్చే ఆయుర్వేద చిట్కా..ఈ మధ్య కాలంలో తెల్లజుట్టు సమస్య అనేది చాలా చిన్న వయస్సులోనే వస్తుంది. దాంతో కంగారు పడిపోయి మార్కెట్ లో దొరికే ఉత్పత్తులను వాడుతూ ఉన్నారు. వాటి కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.

అలా కాకుండా ఇంటి చిట్కాలను ప్రయత్నిస్తే మంచి పలితాన్ని పొందవచ్చు. తెల్లజుట్టును నల్లగా మార్చుకోవటానికి ఆయుర్వేదంలో మంచి చిట్కాలు ఉన్నాయి. వాటిని ఫాలో అయితే సరిపోతుంది.

ఒక బౌల్ లో మెత్తగా రుబ్బిన గోరింటాకు- 100 గ్రాములు,కాఫీ పొడి- 3గ్రాములు,పెరుగు-25గ్రాములు,నిమ్మరసం- 4స్పూన్లు,ఖదిరము(కటేచు)- 3గ్రాములు,బ్రహ్మి పొడి – 10గ్రాములు,ఉసిరి పొడి- 10గ్రాములు వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని గంట పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి గంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.

ఇలా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్లజుట్టు క్రమమగ నల్లగా మారుతుంది. ఈ చిట్కాలో ఉపయోగించిన ఖదిరము(కటేచు),బ్రహ్మి పొడి,ఉసిరి పొడి వంటివి ఆయుర్వేదం షొప్ లలో లభ్యం అవుతాయి.

ఈ చిట్కా ఫాలో అయితే తెల్లజుట్టు నల్లగా మారటమే కాకుండా జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలకుండా పొడవుగా ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు సమస్యలను తగ్గిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."