Shani Dev Puja:శనిదోషం ఎన్ని పూజలు చేసినా పోవట్లేదా? – ఇలా పూజిస్తే తొలగిపోతుంది!
Shani Dev Puja:శనిదోషం ఎన్ని పూజలు చేసినా పోవట్లేదా.. ఇలా పూజిస్తే తొలగిపోతుంది.. హిందూ ధర్మంలో బిల్వ పత్రానికి అత్యంత విశిష్ట స్థానం ఉంది. దీనిని మారేడు దళం అని కూడా అంటారు. ఒక్కో దేవుడికి ఒక్కో రకమైన పుష్పాలతో, పత్రాలతో పూజ చేస్తుంటారు. విష్ణుమూర్తిని రకరకాల పూలతో పూజిస్తారు. అదే శివుణ్ణి బిల్వ పత్రంతో, జలంతో, విభూదితో పూజిస్తారు.
ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేస్తారు. అలాగే నవగ్రహ దోషాల నివారణ కోసం కూడా కొన్ని రకాల పత్రాలతో పూజ చేస్తారు. ముఖ్యంగా శనీశ్వరుణ్ణి కూడా ఎక్కువగా బిల్వ పత్రాలతో పూజించడం చూస్తుంటాం.
శివపురాణం ప్రకారం చూస్తే, బిల్వ వృక్షం సాక్షాత్తూ శివ స్వరూపం. కైలాసంలో పార్వతీ పరమేశ్వరులను శని దర్శించి వచ్చే సమయంలో అందరినీ పెట్టినట్లే నన్ను కూడా పట్టగలవా అని శివుడు అడుగుతాడు.
దానికి సరేనంటాడు శని. అయితే మరుసటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ బిల్వ వృక్ష రూపంగా మారిపోయి శివుడు ఉంటాడు.దాంతో పార్వతి తో పాటు సమస్త దేవతలు శివునికోసం వెతుకుతారు. సాయంత్రం అయ్యాక శివుడు తన రూపం ధరిస్తాడు.
ఈ విధంగానైనా నిన్ను రోజంతా పట్టి ఉంచానని శని చెప్పడంతో అప్పటినుంచి శనీశ్వరుడుగా శని ప్రచారంలోకి వచ్చాడు. అందుకే ఈశ్వరుని మాదిరిగా శనీశ్వరుణ్ణి కూడా బిల్వ దళాలతో పూజిస్తే మంచిదని అంటారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ