Beauty Tips

Sun Tan Remove Tips : పెరుగు ఫేస్ ప్యాక్స్‌తో సన్ టాన్ ఈజీగా తొలగించుకోవచ్చు

Curd and Lemon Face Glow tips in telugu: పెరుగు ఫేస్ ప్యాక్స్‌తో సన్ టాన్ ఈజీగా తొలగించుకోవచ్చు.. ముఖం తెల్లగా కాంతివంతంగా మెరవటానికి ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటాం. అయితే మన వంటింటిలో ఉండే వస్తువులు మన ముఖాన్ని కాంతివంతంగా చేస్తాయనే విషయం మనలో చాలా మందికి తెలియదు.

ఈ రోజుల్లో మనలో చాలా మంది అందం మీద శ్రద్ద పెడుతున్నారు. ఆడ,మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. దాని కోసం రకరకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. అంతేకాకుండా బ్యూటీ పార్లర్ చుట్టూ కూడా తిరిగి వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టిన పెద్దగా ప్రయోజనం ఉండదు.

అదే ఇంటి చిట్కాలను రెగ్యులర్ గా ఫాలో అయితే మంచి ప్రయోజనం కలుగుతుంది. కాస్త ఓపికగా చేసుకుంటే ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. ఇప్పుడు చెప్పే చిట్కా ముఖం మీద నల్లని మచ్చలు,మొటిమలను కూడా తొలగిస్తుంది. ఒక బౌల్ లో ఒక స్పూన్ పెరుగు,ఒక స్పూన్ పాలు,ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి పావు గంట అయ్యాక గోరువెచ్చని నీటిని జల్లుకుంటూ రబ్ చేస్తూ శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే సరిపోతుంది. కాస్త ఓపికగా ఇలా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లని ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు.

ఈ Tip లో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు చర్మానికి పోషణ అందించి చర్మ సమస్యలను తగ్గించటానికి సహాయపడతాయి. కాబట్టి ఈ చిట్కాను ట్రై చేయండి. ముఖం మీద మృత కణాలు తొలగిపోయి ముఖం ప్రకాశవంతంగా మెరుస్తుంది. నల్లని మచ్చలు, ముడతలు, మొటిమలు ఇలా అన్ని చర్మ సమస్యలను తగ్గిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."