Beauty Tips

Flaxseed Hair Gel:జుట్టు పట్టుకుంటేనే రాలిపోతుందా, కంట్రోల్ చేసి ఒత్తుగా పెంచే జెల్..

Flaxseed Hair Gel:జుట్టు పట్టుకుంటేనే రాలిపోతుందా, కంట్రోల్ చేసి ఒత్తుగా పెంచే జెల్.. జుట్టుకి సంబందించిన సమస్యలను తగ్గించటానికి ఇప్పుడు చెప్పే జెల్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాస్త ఓపికగా చేసుకుంటే సరిపోతుంది.

జుట్టు ఒత్తుగా, వేగంగా పెరగాలా? ఈ అవిసె గింజల జెల్ తలకు రాస్తే చాలు..మారిన జీవనశైలి, మారిన ఆహారపు అలవాట్లు, జుట్టుకి సరైన పోషణ చేయకపోవటం వంటి కారణాలతో జుట్టు రాలే సమస్య ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనపడుతుంది.

మనలో చాలా మంది జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే చాలా కంగారు పడుతూ ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. కానీ ఆ ప్రయత్నాలు ఏమి పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు. అందువల్ల సమయాన్ని వృదా చేయకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే తప్పనిసరిగా జుట్టు రాలే సమస్య నుండి బయట పడవచ్చు.

ఈ చిట్కా కోసం ఒక బౌల్ లో రెండు స్పూన్ల మినపప్పును నాలుగు గంటలు నానబెట్టాలి. మరొక బౌల్ లో ఒక స్పూన్ అవిసె గింజలను రెండు గంటల పాటు నానబెట్టాలి. అవిసె గింజలను ఇలా నానబెట్టటం వలన జెల్ వస్తుంది.

నానిన మినపప్పును మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ లో రెండు స్పూన్ల అవిసె గింజల జెల్ వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని జుట్టుకి పట్టించి అరగంట తర్వాత రెగ్యులర్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

మినపప్పు,అవిసె గింజలలో ఉన్న పోషకాలు జుట్టు రాలే సమస్యను,చుండ్రు సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తాయి. ఈ చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. చాలా తక్కువ ఖర్చులో జుట్టు రాలే సమస్య నుండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బయట పడవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."