Beauty Tips

Skin Care Tips:40 ఏళ్ల వయస్సులో 20 ఏళ్ల యంగ్ లుక్ ముడతలు,నల్లని మచ్చలు అన్ని మాయం

Face Glow Tips:ముఖ సంరక్షణలో ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కాస్త ఓపికగా చేస్తే సరిపోతుంది.40 ఏళ్ల వయస్సులో 20 ఏళ్ల యంగ్ లుక్ ముడతలు,నల్లని మచ్చలు అన్ని మాయం.. మనలో చాలా మంది ముఖం ముడతలు,మచ్చలు లేకుండా కాంతివంతంగా మెరుస్తూ ఉండాలని కోరుకోవటం సహజమే.

దాని కోసం ఎంత ఖర్చు పెట్టటానికి అయిన రెడీగా ఉంటారు. అయితే పెద్దగా ఖర్చు లేకుండా ఇంటిలో ఉన్న వస్తువులతో సులభంగా ముఖాన్ని కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు.

దీని కోసం కేవలం మూడే మూడు ఇంగ్రిడియన్స్ సరిపోతాయి. ముందుగా బంగాళాదుంపను ఉడికించి మెత్తని పేస్ట్ గా చేసుకొని దానిలో 2 స్పూన్ల నిమ్మరసం,ఒక స్పూన్ తేనె కలిపి ముఖానికి పట్టించి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే మంచి ఫలితం వస్తుంది.

బంగాళాదుంపలో వివిధ రకాల అవసరమైన ఖనిజాలు ఉన్నాయి, ఇవి వివిధ చర్మ సమస్యలతో పోరాటం చేయటానికి సహాయపడతాయి. బంగాళా దుంప చర్మం కాంతివంతంగా మార్చేందుకు సహాయపడుతుంది. చర్మం మీద మృత కణాలను తొలగించి చర్మం మీద నల్లని మచ్చలు లేకుండా మెరిసేలా చేస్తుంది.

నిమ్మరసంలో ఆల్ఫా హైడ్రాక్సిల్ యాసిడ్‌ ఉండుట వలన నిస్తేజమైన చర్మ కణాలను తొలగించి కొత్త వాటిని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక రకమైన ఎక్స్ ‌ఫోలియెంట్‌ గా పని చేస్తుంది. అంతేకాక విటమిన్ సి,యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన చర్మ సమస్యలను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

తేనెలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. చర్మం మీద నల్లని మచ్చలు,మొటిమలు లేకుండా కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. చర్మానికి తేమను అందిస్తుంది. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అయితే ముఖం మీద నల్లని మచ్చలు,ముడతలు లేకుండా 40 ఏళ్ల వయస్సులో 20 ఏళ్ల యంగ్ లుక్ తో కనపడతారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."