Deeparadhana Facts:దీపారాధన చేసినప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా… అయితే ఆర్ధిక ఇబ్బందులు తప్పవు…
Deeparadhana:మనం ప్రతి రోజు దీపారాధన చేస్తూ ఉంటాం. అలా చేసినప్పుడు మనం తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
మనలో చాలా మందికి ఎంత కష్టపడి డబ్బు సంపాదించినా ఆర్ధిక ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే అనవసర ఖర్చులు ఎక్కువగా ఉండటం వంటి కారణాలతో డబ్బు చేతిలో నిలబడదు. ఈ ఇబ్బందుల నుండి బయట పడాలంటే ఇప్పుడు చెప్పే విధంగా దీపారాధన చేస్తే సరి.
మంగళ వారం,శుక్రవారం ఆవునేతితో దీపారాధన చేస్తే సకల సంపదలు కలుగుతాయి. మంగళ వారం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలస్నానము చేసి ఇంటిని శుభ్రం చేసుకొని పూజకు కావలసిన వస్తువులను సిద్ధం చేసుకోవాలి. దీపారాధన చేసే కుందికి పసుపు,కుంకుమ పెట్టాలి.
కుందిలో సంపదకు అది దేవత అయినా లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఆవునెయ్యి, వత్తులను వేయాలి. దీపమును కేవలం అగరబత్తితో మాత్రమే వెలిగించాలి. ఈ విషయాన్నీ తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అగ్గిపుల్లతో అసలు దీపాన్ని వెలిగించకూడదు. అంతేకాక అప్పటికే వెలిగించి ఉన్న దీపంతో కూడా దీపాన్ని వెలిగించకూడదు.
ఈ విధంగా ఆవునెయ్యితో దీపారాధన చేయటం వలన ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. అప్పుల బాధలు ఉండవు. మంగళ వారం ఉదయం లేదా సాయంత్రం లక్మి దేవి చిత్ర పటం ముందు నేతి దీపాన్ని వెలిగించటం వలన మీకు రావలసిన బకాయిలు అన్ని వచ్చేస్తాయి. చదువుకొనే పిల్లలతో సరస్వతి దేవి పటం ముందు నేతి దీపాన్ని పెట్టిస్తే ఉన్నత చదువులు చదువుతారు. ఈ నేతి దీపారాధన మంగళవారం లేదా శుక్రవారం మీకు వీలును బట్టి చేయవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ