Skin Care Tips: ముఖంపై ఇది కలిపి పూస్తే ముఖంపై బంకలా పట్టిన పిగ్మెంటేషన్,మచ్చలు అన్ని ఒక్క సారిగా క్లీన్ అవుతాయి
Pimples Home remedies: అందంగా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. ఆ అందాన్ని పెంచుకోవడం ఈతరం అమ్మాయిలు మార్కెట్లో దొరికే వివిధ రకాల క్రీములు, ఫేషియల్స్ ని వేలకు వేలు పెట్టి కొనుగోలు చేసి తమ ముఖాలపై ప్రయోగిస్తున్నారు. అయితే… వాటి వల్ల నిజంగా ప్రయోజనం చేకూరుతుందా లేదా అన్న విషయం పక్కన పెడితే… వాటికి బదులు మన కిచెన్ లోని కొన్ని పదార్థాలతో అందం పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
తేనె, పంచదార సమపాళ్లలో తీసుకొని బాగా కలిపి కళ్ల చుట్టూ మినహాయించి ముఖానికి, మెడకు పట్టించాలి. ఆ తర్వాత వలయాకారంలో మర్ధన చేయాలి.
ఇలా చేయడం వల్ల చర్మానికి నునుపుదనం రావడంతోపాటు మృతకణాలు తొలగిపోతాయి. మెటిమల వల్ల చాలా మంది ముఖంపై గుంతలు పడతాయి.
కానీ ఇలా తేనె, పంచదారతో కలిపి మర్దన చేయడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.రెండు టేబుల్ స్పూన్ల టమాటో జ్యూస్ లో ఓట్స్, పెరుగు కలిపి కొద్దిగా నీరు కూడా కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. అరగంటసేపు అలానే ఉంచుకొని ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమలు, బ్లాక్ హెడ్స్ తగ్గిపోతాయి.రెండు టీ స్పూన్ల క్యారెట్ తరుము, టీ స్పూన్ తేనె కలపాలి.
ఈ మిశ్రమానికి రెండు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ చేర్చాలి. దీనిని ముఖానికి రుద్ది.. పావుగంట తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వల్ల చర్మం కాంతులీనుతుంది.
రెండు టీ స్పూన్ల తేనెలో కొద్దిగా దాల్చిన చెక్క పొడిని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోబోయే ముందు ముఖానికి అప్లై చేసి వేళ్లతో 20 నిమిషాలపాటు మృదువుగా మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా సమయం దొరికినప్పుడల్లా చేస్తుంటే ముఖంపైన జిడ్డు, మొటిమలు తగ్గిపోయే అవకాశం ఉంది.
మరొక చిట్కా తెలుసుకుందాం. దీనికోసం ముందుగా టమాటా, బంగాళదుంప జ్యూస్ తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో ఒక స్పూన్ శనగపిండి, ఒక కాఫీ ప్యాకెట్ లో పౌడర్, అర స్పూన్ కొబ్బరి నూనె, ఒక స్పూన్ పెరుగు, టమాటా బంగాళదుంప జ్యూస్ రెండు స్పూన్లు వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాలు అయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే ముఖం మీద నల్లని మచ్చలు, పిగ్మెంటేషన్, మొటిమలు ఇలా అన్ని రకాల సమస్యలు తొలగిపోయి ముఖము తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ