Beauty Tips

White Hair: ఈ సూపర్ ఫుడ్స్ తినండి చాలు.. తెల్లజుట్టు మంత్రించినట్టు మాయమవుతుంది..

White HAir:వయసు పెరిగే కొద్దీ తెల్ల జుట్టు రావటం అనేది కామన్. తెల్ల జుట్టు రాగానే మనలో చాలామంది కంగారు పడిపోతూ ఉంటారు. ఎందుకంటే తెల్ల జుట్టు వస్తే చిన్న వయసులోనే పెద్దవారిలా కనబడతారు. తెల్ల జుట్టును కవర్ చేయటానికి రసాయనాలు ఉన్న ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా కాకుండా సహజ సిద్ధంగా చెక్ పెట్టాలంటే కొన్ని ఆహారాలు తప్పనిసరిగా తీసుకోవాలి.ఆ ఆహారాల గురించి తెలుసుకుందాం.

kalonji seeds
కలోంజి సీడ్స్ నువ్వులను పోలి ఉంటాయి. జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. తల చర్మం లో రక్తప్రసరణను మెరుగుపరిచి జుట్టును ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా తెల్ల జుట్టు నల్లగా మార్చడంలో చాలా బాగా సహాయపడుతుంది. కలోంజి సీడ్స్ ని మెత్తని పేస్ట్ గా చేసి జుట్టుకు పట్టించవచ్చు.. లేదంటే కలోంజీ విత్తనాలను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగవచ్చు.

ఉసిరి
ఉసిరిలో జుట్టు పెరుగుదలకు మరియు జుట్టు నల్లగా ఉండటానికి సహాయపడే పోషకాలు చాలా సమృద్ధిగా ఉన్నాయి. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన హెయిర్ పోలికల్స్ లో ఉన్న సహజసిద్ధమైన నలుపు రంగును రక్షించడంలో సహాయపడుతుంది.

కరివేపాకు
జుట్టు సంరక్షణలో కరివేపాకు చాలా బాగా సహాయపడుతుంది. చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును నివారిస్తుంది. హెయిర్ పోలికల్స్ లో మెలనిన్ ఉత్పత్తిని పెంచి తెల్లగా ఉన్న జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది.

గోధుమ కట్టి
చాలా చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారే సమస్యను తగ్గిస్తుంది. జుట్టు కుదుళ్ళను ఉత్తేజపరిచి జుట్టు తెల్లగా మారకుండా జుట్టు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. శరీరంలో టాక్సిన్స్ తొలగిస్తుంది.

నల్ల నువ్వులు
వీటిని ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. జుట్టును ఆక్సికరణ ఒత్తిడి నుంచి రక్షించి జుట్టు బలంగా పొడవుగా పెరిగేలా చేస్తుంది. అలాగే జుట్టు నల్లగా ఉండేలా చేస్తుంది. ప్రతిరోజు ఒక స్పూన్ నల్ల నువ్వులను తింటే సరిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."