Beauty TipsHealth

Face Glow Tips:బీట్ రూట్ +శనగపిండి.. ఎప్పటిలా కాకుండా ఇలా ట్రై చేస్తే.. ఎంత ఎండలో తిరిగిన మీ ముఖం నల్లబడదు

Face Glow Tips:బీట్ రూట్ +శనగపిండి..ఎప్పటిలా కాకుండా ఇలా ట్రై చేస్తే..ఎంత ఎండలో తిరిగిన మీ ముఖం నల్లబడదు. వాతావరణ కాలుష్యం కారణంగా ముఖం మీద మురికి,మృతకణాలు పేరుకుపోతాయి. దాంతో ముఖం నల్లగా,నిస్తేజంగా మారిపోయి కాంతివిహీనంగా కనపడుతుంది. అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే చిట్కాను ఫాలో అయితే ముఖం తెల్లగా,కాంతివంతంగా కనపడుతుంది. ఈ చిట్కా కోసం మూడు ఇంగ్రిడియన్స్ ని ఉపయోగిస్తున్నాం. ఇవి మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవే.

మొదటి ఇంగ్రిడియన్ గోధుమపిండి
గోధుమపిండిలో ఉండే బ్లీచింగ్ గుణాలు,పోషకాలు చర్మాన్ని సహజంగా బ్లీచ్ చేయటంలో సహాయపడతాయి. ఇది ముఖం మీద నలుపును,మృత కణాలను తొలగించి ముఖం తెల్లగా,కాంతివంతంగా ఉండేలా చేస్తుంది.

రెండో ఇంగ్రిడియన్ పెరుగు
పెరుగు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడుతుంది.పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం ముఖం మీద పేరుకుపోయిన మృతకణాలను, నలుపును తొలగించి ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది.
lemon benefits
మూడో ఇంగ్రిడియన్ నిమ్మకాయ
నిమ్మరసాన్ని ముఖానికి రాస్తే నలుపు, డల్ నెస్ తొలగిపోయి కాంతివంతంగా మారుతుంది.నిమ్మరసంలో ఉండే విటమిన్ సి,సిట్రిక్ ఆమ్లంముఖాన్ని తెల్లగా మారుస్తాయి.
Young Look In Telugu
ఇప్పుడు ప్యాక్ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకోని దానిలో ఒక స్పూన్ గోధుమపిండి, ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ నిమ్మరసం వేసి మూడు ఇంగ్రిడియన్స్ బాగా కలిసేలా కలపాలి. మూడు ఇంగ్రిడియన్స్ బాగా కలిసిపోయాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. ముఖానికి రాసే ముందు ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ముఖానికి ప్యాక్ వేశాక రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. ప్యాక్ ఆరాక సాదారణమైన నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ని ముఖం నిస్తేజంగా కనిపించినప్పుడు లేదా బయటకు వెళ్ళే ముందు వేసుకుంటే ముఖం తాజాగా,కాంతివంతంగా కనపడుతుంది. ముఖం మీద పెరుకుపోయిన మృతకణాలు,నలుపు తొలగిపోతాయి.

చూసారుగా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి. పార్టీ లేదా ఫంక్షన్ వెళ్ళేటనికి అరగంట ముందు ఈ ప్యాక్ వేసుకుంటే బ్యూటీ పార్లర్ తో పనిలేకుండా ముఖం తెల్లగా,కాంతివంతంగా మెరిసిపోతుంది.

మరో చిట్కా కూడా తెలుసుకుందాం. చిన్న ముక్క beetroot,చిన్న ముక్క బంగాళదుంప, చిన్న ముక్క టమోటా ముక్క తీసుకోని మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. దీనిని ఒక బౌల్ లో తీసుకోవాలి. ఈ మిశ్రమంలో ఒక స్పూన్ శనగపిండి,ఒక స్పూన్ పెరుగు వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాలు అయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే సరిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."