Ugadi Pachadi:సింపుల్ గా 2 నిమిషాల్లో ఉగాది పచ్చడి తయారి ఎలానో చూడండి
Ugadi Pachadi:తెలుగువారి మొదటి పండుగ ఉగాది. అందుకే దీనిని తెలుగు సంవత్సరాది అని పిలుస్తారు. ఈ ఏడాది(2025) ఉగాది పండుగ మార్చి 30న ప్రారంభమైంది. అందుకే ఆ రోజున ఉగాది పచ్చడి తిని దినచర్య మొదలుపెడుతారు.
సింపుల్ గా 2 నిమిషాల్లో ఉగాది పచ్చడి తయారి ఎలానో చూడండి. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఆ రోజు ఉగాది పచ్చడి చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టి తింటాం. ఈ ఆచారం అనాదిగా వస్తుంది.
ఉగాది పచ్చడి అనేది తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు కలసిన షడ్రుచుల సమ్మేళనం. సంవత్సరం మొత్తంలో ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలనే భావనను ఈ ఉగాది పచ్చడి కలిగిస్తుంది. ఇప్పుడు ఉగాది పచ్చడి ఎలా తయారుచేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.
కావలసిన పదార్ధాలు
చింతపండు
మామిడి కాయ ముక్కలు
వేప పువ్వు
కొబ్బరి ముక్కలు
బెల్లం తురుము
పచ్చి మిర్చి ముక్కలు
అరటి పండు ముక్కలు
ఉప్పు
చింతపండులో నీరు పోసి అరగంట నానబెట్టి రసాన్ని తీయాలి. ఆ రసంలో మామిడి కాయ ముక్కలు ,వేప పువ్వు ,కొబ్బరి ముక్కలు ,బెల్లం తురుము ,పచ్చి మిర్చి ముక్కలు ,అరటి పండు ముక్కలు ,ఉప్పు వేసి బాగా కలపాలి. అంతే ఉగాది పచ్చడి రెడీ.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ