Beauty TipsHealth

Face Glow Tips:పది నిమిషాల్లో ముఖం తెల్లగా కాంతివంతంగా మారాలా.. అయితే ఈ రెమెడీస్‌ మీకోసమే!

Rice and lemon Face Glow Tips In telugu : ఒక్కోసారి చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్( Dead skin cells ) పేరుకుపోయి నల్లగా నిర్జీవంగా మారుతూ ఉంటుంది.అలాంటి సమయంలో ఏదైనా ఫంక్షన్ లేదా ముఖ్యమైన మీటింగ్ ఉంటే తెగ హైరానా పడిపోతుంటారు.

ఈ మధ్య కాలంలో వాతావరణంలో వచ్చే మార్పులు, సరైన జీవనశైలి లేకపోవటం వంటి కారణాలతో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ముఖానికి సంబందించిన సమస్యలు వచ్చినప్పుడు కంగారు పడకుండా ఈ చిట్కాలను ఫాలో అవ్వవచ్చు.

ముఖం అందంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. దాని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంటిలో సహజసిద్దంగా దొరికే వస్తువులతో ముఖాన్ని తెల్లగా,కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు. కాస్త ఓపికగా చేసుకుంటే సరిపోతుంది.

ఒక బౌల్ లో రెండు స్పూన్ల బియ్యాన్ని వేసి నీటిని పోయాలి. దానిలో దానిలో ఒక నిమ్మకాయను సగానికి కట్ చేసి దానిని ఆరు ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత రెండు స్పూన్ల రోజ్ వాటర్ వేసి ఒక గంట సేపు అలా వదిలేయలి. గంట అయ్యాక బాగా కలిపి ఆ నీటిని వడకట్టాలి. ఈ నీటిని కాటన్ బాల్ సాయంతో ముఖానికి పట్టించాలి.

పావుగంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది. ముఖం మీద ముడతలు, నల్లని మచ్చలు అన్నీ తొలగిపోయి కాంతివంతగా మెరుస్తుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాస్త ఓపికగా చేసుకుంటే చాలా చక్కని ఫలితాన్ని ఇస్తాయి.

బియ్యం నీటిలో ఉన్న పోషకాలు ముఖం మీద ఉన్న మృత కణాలను తొలగించి ముఖం మెరిసేలా చేస్తుంది. నిమ్మలో ఉండే బ్లీచింగ్ లక్షణాలు ముఖం మెరవటానికి సహాయపడుతుంది. ఇక రోజ్ వాటర్ అన్నీ చర్మ తత్వాలకు సెట్ అవుతుంది. వేల కొద్ది డబ్బులను ఖర్చు పెట్టటం కన్నా చాలా తక్కువ ఖర్చులో ఇంటి చిట్కాలను ఫాలో అవ్వటం మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."