Devotional

Astro Tips:వాహనాలకు నిమ్మకాయలు ఎందుకు కడుతారంటే? దాని వెనుక సెంటిమెంట్ ఇదే..

Astro Tips:ఉగ్ర దేవతల శాంతికి నిమ్మకాయలు,తియ్యగుమ్మడి వంటి వాటిని ఉపయోగిస్తారు. సాధారణంగా వాహనాల ప్రమాదాల నుండి రక్షించటానికి సాత్విక‌ దేవతల కంటే ఉగ్రదేవతలనే ఎక్కువగా నమ్ముతారు. సాధారణంగా హనుమంతుని దేవాలయాలలో వాహన పూజలను ఎక్కువగా చేస్తారు. దేవునికి నిమ్మకాయలు నివేదించిన తర్వాత నిమ్మకాయలు వాహనాలకు కడతారు.

దిష్టితీసి చక్రాలతో తొక్కిస్తారు. ఇందువల్ల మేలు జరుగుతుందని నమ్మకం. పుల్లగా ఉండే నిమ్మకాయ రసం, కారం నిండి ఉండే మిరపకాయలను వాహనాలకు, దుకాణాల వద్ద వేలాడదీయడం వెనుక జ్యోతిష శాస్త్ర కారణం ఉంది. గ్రహాలలో ఎర్రనిది, ఉగ్రత్వం కలిగినది కుజగ్రహం. కుజుడు ప్రమాద కారకుడని శాస్త్రనమ్మకం.

కుజుని అధిదైవం హనుమంతుడు. అలాగే గ్రహాల్లో శుక్ర గ్రహానికి చెందిన రుచి పులుపు. అభివృద్ధికి, సంపదకు శుక్రుడు కారకుడు. కారం రవిగ్రహానికి చెందినది. అధికారానికి రవి కారకుడు. వీరు వాహన చోదకుని పట్ల శాంతులై ఉండాలని కోరుతూ వాహనాలకు నిమ్మకాయలు, మిరపకాయలు కడతారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."