Beauty TipsHealth

Rice Flour For Skin: బియ్యం పిండిలో కలిపి వాడితే.. మీ ముఖం తెల్లగా మెరిసిపోతుంది తెలుసా ?

Face Glow Tips:ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి , బిజీ లైఫ్‌లో కారణంగా చాలా మంది చర్మాన్ని అస్సలు పట్టించుకోలేకపోతున్నారు. దీని వల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు వస్తుంటాయి. దీంతో వీటిని వదిలించుకోవడానికి కొందరు బయట మార్కెట్‌లో దొరికే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు.

అంతే కాకుండా మరికొందరైతే బ్యూటీ పార్లర్‌కి వెళ్లి రకరకాల ఫేషియల్ ట్రీట్‌మెంట్లు చేయించుకుంటారు. అయినప్పటికీ ఫలితం అంతంత మాత్రమే.. తాత్కాలికంగా స్కిన్ మెరిసిపోయానా కూడా కొన్ని రోజుల తర్వాత అంతా మామూలై పోతుంది. అందుకే ఇంట్లోనే ఉండే కొన్ని రకాల పదార్థాలను వాడి ముఖాన్ని మెరిసేలా చేసుకోవచ్చు.

బ్యూటీ పార్లర్ కి వెళ్ళటానికి సమయం లేనివారు…ఇలా చేస్తే ముఖం తెల్లగా మెరిసిపోతుంది..వేసవికాలంలో చర్మానికి సంబంధించిన సమస్యలు ఎన్నో వస్తూ ఉంటాయి. ముఖ్యంగా వేసవికాలంలో చర్మం జిడ్డుగా మారుతుంది. మొటిమలు, దురద, దద్దుర్లు వంటి అన్ని రకాల సమస్యలకు బియ్యం పిండి మంచి ఉపశమనం కలిగిస్తుంది. బియ్యం పిండి మనకు ఇంటిలో సులభంగా లభ్యం అవుతుంది.

ఒక స్పూన్ బియ్యప్పిండిలో రోజ్ వాటర్ వేసి బాగా కలిపి ముఖానికి రాసి ఐదు నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది స్క్రబ్బింగ్ వలె పనిచేస్తుంది. చర్మం మీద మురికి, దుమ్ము, ధూళి వంటి వాటిని తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

జిడ్డు చర్మం ఉన్నవారికి ఇప్పుడు చెప్పే ప్యాక్ చాలా బాగా సెట్ అవుతుంది. బియ్యం పొడిలో నిమ్మరసం, గ్రీన్ టీ వేసి బాగా కలిపి చర్మానికి రాయాలి. ఐదు నిమిషాలు అయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. గ్రీన్ టీ చర్మాన్ని బ్యాక్టీరియా నుండి రక్షిస్తుంది. బియ్యం పొడి, చిటికెడు పసుపు మరియు విటమిన్ ఇ నూనెతో కలబంద జెల్ మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి.

ఇది మీ డల్ స్కిన్‌కి తిరిగి మెరుపును తెస్తుంది. అలాగే చర్మం తేమను కాపాడుతుంది. టాన్ తొలగించడానికి బియ్యం పొడిని కూడా ఉపయోగించవచ్చు. ఒక బౌల్ లో ఒక స్పూన్ బియ్యం పిండి,అరస్పూన్ తేనే, రెండు స్పూన్ల పాలను పోసి పేస్ట్ గా తయారుచేయాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి 5 నిమిషాలు అయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. పొడి చర్మంతో ఇబ్బంది పడేవారికి కూడా ఈ ప్యాక్ చాలా బాగా సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."