Warts Removing : పులిపిర్లు పోవాలా.. ఇలా చేయండి..
పులిపిర్లు అనేవి వయస్సుతో సంబందం లేకుండా ఆడ,మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని వేదిస్తున్నాయి. ముఖం మీద వస్తే మాత్రం అందాన్ని పాడు చేస్తాయి.
ముఖం మీద అంద వికారంగా కనిపిస్తాయి. అమ్మాయిలైతే పులిపిర్లతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. పులిపిర్లు ముఖం మీదే కాకుండా మెడ,కాళ్ళు,చేతులు ఎక్కడ పడితే అక్కడ వస్తూ ఉంటాయి.
పులిపిర్లు తగ్గించుకోవటానికి ఖరీదైన క్రీమ్ లు వాడవలసిన అవసరం లేదు. ఇంటి చిట్కాలతో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. ఈ రోజు రెండు చిట్కాలు తెలుసుకుందాం. మనం ఉపయోగించే ఇంగ్రిడియన్స్ అన్నీ ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవే. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
ఆవిసే గింజలను నీటిలో గంటసేపు నానబెట్టి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ లో తేనె కలిపి పులిపిర్లు ఉన్న ప్రదేశంలో రాసి చిన్న బ్యాండేజ్ వేయాలి. ఇలా చేస్తూ ఉంటే క్రమంగా పులిపిర్లు రాలిపోతాయి. ఈ చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఆవిసే గింజలు, తేనె లో ఉండే పోషకాలు పులిపిర్లను తగ్గిస్తాయి.
ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్ లోవేసి దానిలో వెనిగర్ పోసి రాత్రంతా అలా వదిలేయాలి. మరుసటి రోజు ఉదయం వెనిగర్ లో కాటన్ ముంచి పులిపిర్ల మీద రాసి చిన్న బ్యాండేజ్ వేయాలి. పావుగంట అయ్యాక శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే క్రమంగా పులిపిర్లు రాలిపోతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ