Beauty TipsHealth

Hair Care Tips:జుట్టు రాలే సమస్య మిమ్మల్ని వేధిస్తోందా.. ఒక స్పూన్ నూనె చాలు..

Hair Fall Tips in telugu : ప్రస్తుత కాలంలో మనలో చాలా మందికి జుట్టు సమస్యలు పెరిగిపోతున్నాయి. పొడి జుట్టు, తెల్ల జుట్టు, హెయిర్ ఫాల్, బట్ట తల వంటి సమస్యలు పెరిగాయి. బిజీ లైఫ్‌స్టైల్, ఒత్తిడి, కాలుష్యం, దుమ్ము వంటి కారణాల వల్ల జుట్టుకు ఎక్కువగా నష్టమవుతుంది. దీంట్లో అందరికి కామన్ గా ఉండేది హెయిర్ ఫాల్.

జుట్టు రాలే సమస్య ఉన్నప్పుడు ఖరీదైన నూనెలను వాడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో తయారు చేసుకున్న నూనెలను వాడితే సరిపోతుంది. చాలా బాగా పనిచేస్తాయి. తక్కువ ఖర్చుతో జుట్టుకి సంబందించిన అన్నీ రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు.

జుట్టు రాలడం తగ్గడమే కాకుండా జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా పొడవుగా పెరుగుతుంది. జుట్టు కుదుళ్లు బలంగా ఉండేలా చేస్తుంది. ఒక పాన్ తీసుకొని రెండు తమలపాకులను చిన్నచిన్న ముక్కలుగా చేసుకుని వేయాలి. ఆ తర్వాత మూడు కరివేపాకు రెబ్బలను ఆకులుగా విడ తీసి వేయాలి.

ఆ తర్వాత ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ కలోంజి విత్తనాలు వేసి దానిలో కొబ్బరి నూనె వేయాలి. వీటన్నింటినీ వేసుకున్నాక ఈ పాన్ ను పొయ్యి మీద పెట్టి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగిస్తే వాటిలో ఉన్న పోషకాలు నూనెలోకి చేరతాయి.

ఈ నూనెను వడగట్టి ప్రతిరోజు తలకు రాసుకుంటే క్రమంగా జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా బలంగా ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ నూనె రాయటం వలన చుండ్రు సమస్య కూడా తొలగిపోతుంది. ఈ నూనెను ఒక సారి తయారు చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు.

అలాగే తెల్లజుట్టు తక్కువగా ఉంటే తెల్లజుట్టును నల్లగా మారుస్తుంది. కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే జుట్టుకి సంబందించిన అన్ని రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉండవు. కాబట్టి ఈ నూనెను ట్రై చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ