Beauty Tips

Eye Dark Circles: కళ్ల కింద నల్లటి వలయాలు పోగొట్టడం ఎలా..? అద్భుతమైన చిట్కాలు..!

Dark circles:మనిషికి శరీరంలో కళ్లు కూడా ముఖ్యమైనవి. ఇవి బాగుంటేనే ప్రపంచాన్ని చూడగలుగుతాము. లేకపోతే అంధకారమే. కళ్ల విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా కళ్ల కింద నల్లటి వలయాలు చాలా మందికి ఏర్పడుతుంటాయి. నల్లటి వయయాలను తగ్గించుకునేందుకు రకరకాల చిట్కాలు వాడుతుంటారు.

ఇలా చేస్తే 15 నిమిషాల్లో కంటి కింద నల్లని వలయాలు మాయం అవుతాయి.. కంటి కింద నల్లటి వలయాలు వచ్చాయంటే మనలో చాలా మంది కంగారు పడిపోయి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ కోసం వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా చాలా తక్కువ ఖర్చులో ఇంటిలో ఉండే కొన్ని సహజసిద్దమైన పదార్ధాలతో సులభంగా తగ్గించుకోవచ్చు.

ఒక బౌల్ లో ఒక స్పూన్ బంగాళాదుంప రసం, ఒక స్పూన్ కీరా రసం,అరస్పూన్ తేనె, ఒక విటమిన్ E Capsule లోని ఆయిల్ వేసి బాగా కలిపి కంటి చుట్టూ నల్లని వలయాలు ఉన్న ప్రదేశంలో రాసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నాలుగు రోజుల పాటు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

ఇలా చేస్తూ మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటూ,మంచి నీటిని ఎక్కువగా తాగుతూ చక్కని నిద్ర ఉండేలా చూసుకోవాలి. బంగాళాదుంపను తొక్కతోనే రసం తీయాలి. బంగాళాదుంప బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. అలాగే విటమిన్ సి, విటమిన్ ఎ, స్టార్చ్ మరియు ఎంజైమ్‌ లు సమృద్దిగా ఉండుట వలన పోషణను అందిస్తుంది.

కీరాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ నల్లటి వలయాలను తగ్గించటానికి సహాయపడుతుంది. విటమిన్ E కూడా నల్లని వలయాలను తగ్గించటంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ