Devotional

Lucky Colors: వారంలో ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరించాలో తెలుసా? ఇలా చేస్తే లక్ మొత్తం మీదే..

Lucky Color:జ్యోతిషశాస్త్రంలో రంగులు కూడా చాలా ముఖ్యమైనవి.ప్రతి వారం ఆయా గ్రహాల ప్రత్యేక రంగులను ధరించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతారు.మీ రాశిచక్రం, జన్మ నక్షత్రం మరియు పుట్టిన తేదీని బట్టి లక్కీ కలర్ మారినప్పటికీ, ఈ ఏడు రోజులు ఈ 7 రంగులు అందరికీ అనుకూలంగా ఉంటాయి.

అదృష్టం కలగాలంటే ఏ రోజు ఏ రంగు దుస్తులను ధరించాలి.. రంగులు అనేవి మనస్సులోని భావాలను తెలియజేస్తాయి. ప్రతి రంగుకు గొప్ప గుణాలు ఉన్నాయి. చాలా రంగులకు జబ్బులను నయం చేసే లక్షణాలు ఉన్నాయి. దీనినే కలర్ థెరపీ అంటారు.

కొన్ని రంగులు మనకు నచ్చి ఆకర్షింపబడతాము.దీనినే ” కలర్ సైన్స్ ” అంటారు. కాని జ్యోతిష్యాన్ని నమ్మేవారు రోజును బట్టి రంగు దుస్తులను ధరిస్తున్నారు.

ఆదివారం: ఆదివారం నాడు సూర్యుడిని ప్రార్థిస్తారు. ఈ రోజున గులాబీ రంగు కలిగిన వస్త్రాలను ధరించాలి.

సోమవారం: సోమవారం అంటే చంద్రునికి ప్రతీక, కాబట్టి ఈ రోజున తెల్లటి వస్త్రాలను ధరించండి.

మంగళవారం : మంగళవారం హనుమంతుని రోజుగా భావిస్తారు. హనుమంతుని విగ్రహాలను కాషాయం రంగులో చూస్తుంటాం. కాబట్టి మంగళవారంనాడు ప్రత్యేకంగా కాషాయం రంగు కలిగిన వస్త్రాలను ధరించండి. ఫలితం ఉంటుందంటున్నారు జ్యోతిష్యులు.

బుధవారం : వారంలో మూడవ రోజు గణాధిపతికి సంబంధించిన రోజు. విఘ్నాలకు అధిపతైన విఘ్నేశ్వరునికి ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి బుధవారం నాడు పచ్చరంగు కలిగిన వస్త్రాలను ధరించండి.

గురువారం : గురువారాన్ని బృహస్పతి వారం అని కూడా అంటారు. ఈ రోజున గురువులకు అధిపతైన బృహస్పతి దేవుడు అలాగే షిరిడీ సాయిబాబాకు మహా ప్రీతి. బృహస్పతి దేవునికి పసుపు రంగంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించండి.

శుక్రవారం : శుక్రవారం దేవీ(అమ్మవారు)కి సంబంధించిన రోజు. అమ్మవారు జగజ్జననీ. ఆమె సర్వాంతర్యామి. కాబట్టి ఈ రోజున అన్ని రంగుల మిశ్రమమున్న వస్త్రాన్ని ధరించండి.

శనివారం : శని దేవునికి సమర్పించే ఈ రోజున నీలి రంగు కలిగిన వస్త్రాలను ధరించండి.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ