Beauty Tips

Cracked Lips:పెదాలు నల్లగా మారి పగులుతున్నాయా.. ఇలా చేయండి..

Cracked Lips In telugu : పెదవులు నల్లబడటానికి జన్యుశాస్త్రం, జీవనశైలి అలవాట్లు, కొన్ని వైద్య విధానాలతో సహా అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. కారణం ఏమైనప్పటికీ, కొన్ని ప్రక్రియలు మీ పెదాలను ఎర్రగా మార్చవచ్చు.

చలికాలంలోనె కాకుండా వేసవికాలంలో కూడా పెదాలు పగులుతూ ఉంటాయి. పెదాలు పగిలిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అలాగే పెదాలు నల్లగా లేకుండా గులాబీ రంగులో మెరిసిపోతూ ఉంటే చూడటానికి చాలా బాగుంటాయి.

అయితే ఆహారపు అలవాట్లు., ధూమపానం, మద్యపానం, వాతావరణంలో వచ్చే మార్పులు, మృత కణాలు, శరీరంలో అధిక వేడి ప్రభావం, కెమికల్స్ ఎక్కువగా ఉండే లిప్ స్టిక్ వాడటం వంటి అనేక రకాల కారణాలతో పెదాలు నల్లగా మారుతూ ఉంటాయి.

అలాగే చాలా మందికి పెదాలు పగులుతూ ఉంటాయి. ఇప్పుడు కాలం మారటంతో పెదాలు పగిలే సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పెదాలపై ఎక్కువ శ్రద్ద పెట్టవలసిన అవసరం ఉంది. చాలా మంది పెదాలను గులాబీ రంగులో మార్చుకోవటానికి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేలకు వేలు డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు.

అలా కాకుండా ఇంటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాలతో మ్యాజికల్ సీరం తయారుచేసుకొని వాడితే పగిలిన, నల్లగా ఉన్న పెదాలు మృదువుగా గులాబీ రంగులోకి మారతాయి. ఒక బౌల్ లో మూడు స్పూన్ల స్వీట్ ఆల్మండ్ ఆయిల్, రెండు స్పూన్ల అలోవెరా జెల్ వేసి రెండు బాగా కలిసేలా దాదాపుగా ఐదు నిమిషాల పాటు కలపాలి.

ఆ తరువాత ఈ మిశ్రమంలో ఒక స్పూన్ నిమ్మరసం, రెండు స్పూన్ల గ్లిజ‌రిన్ వేసి అన్ని ఇంగ్రిడియంట్స్ బాగా కలిసేలాగా మూడు నుంచి ఐదు నిమిషాల పాటు స్పూన్ తో బాగా కలపాలి. అంతే హోం మేడ్ లిప్ సీరం తయారు అయ్యినట్టే. ఈ సీరంను సీసాలో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి. ఈ సీరంను రోజుకు క‌నీసం రెండు నుంచి మూడు సార్లు పెదాలపై రాస్తూ ఉండాలి.

ఇలా చేస్తూ ఉంటె పగిలిన పెదాలు నుంచి ఉపశమనం కలగటమే కాకుండా నల్లగా ఉన్న పెదాలు మృదువుగా గులాబీ రంగులోకి మారతాయి. కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ చిట్కాను ఫాలో అయ్యి ఈ చలికాలంలో వచ్చే పెదాల సమస్యల నుండి బయట పడవచ్చు. కాస్త శ్రద్ద సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. ఒక్కసారి తయారుచేసుకుంటే దాదాపుగా 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."