Healthhealth tips in telugu

Mint Leaves: ఈ ఆకు రసం తాగారంటే.. దెబ్బకు కీళ్ల నొప్పులు పరార్..

Home remedies for body pain In telugu : పుదీనా ఆకు వంటల్లో రుచికి మాత్రమే కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఆకు రసం నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. తలనొప్పి వచ్చినప్పుడు పుదీనా ఆకు టీ తాగడం లేదా పుదీనా ఆకులను నమలడం వల్ల గొప్ప ఉపశమనం లభిస్తుంది.

శరీరంలో ఎక్కడైనా నొప్పులు ఉంటే పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటాం.పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం వల్ల దీర్ఘ కాలికంగా ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సహజసిద్ధంగా మన ఇంటిలో సులభంగా ఉన్న వస్తువులను ఉపయోగించి తగ్గించుకోవటానికి ఈరోజు కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.

పుదీనా ఆకులను తీసుకొని బాగా కడిగి ఒక గ్లాసు నీటిలో వేసి ఏడు నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి. ఇలా మరిగించడం వల్ల పుదీనా ఆకులోని పోషకాలు అన్ని నీటిలో చేరతాయి. ఈ నీటిని వడగట్టుకుని రాత్రి పడుకోవడానికి ముందు తాగాలి.పుదీనా ఆకులలో ఉండే మెంథాల్ కండరాలను సడలించి నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది.

నీటిని వడకట్టిన తర్వాత ఉడికిన పుదీనా ఆకులు ఉంటాయి కదా ఆ ఆకులలో ఒక స్పూన్ సొంఠి పొడి, ఒక స్పూన్ పంచదార పొడి, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని. నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి ఒక క్లాత్ తో కట్టాలి. ఈ విధంగా రాత్రి సమయంలో చేసే ఉదయం ఆ. కట్టు తీసేస్తే ఒకటి రెండు రోజుల్లోనే నొప్పి నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ