Healthhealth tips in telugu

Milk With Kismis Benefits : పాలతో కిస్‍మిస్ తీసుకోండి.. చాలా ప్రయోజనాలు.. తెలిస్తే వదలరు

Milk With Raisins Benefits : పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు మనందరికీ తెలుసు. ఆరోగ్యంగా ఉండటానికి పాలలో అనేక పదార్థాలను మిక్స్ చేసి తింటారు. బాదం, యాలకులు, బెల్లం, ఎండుద్రాక్ష(కిస్‍మిస్) వంటివి. అయితే పాలలో కిస్‍మిస్‍తో కలిపి తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం..

ప్రతి రోజు మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే ఏ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. ప్రస్తుతం మారిన పరిస్థితి కారణంగా మనలో చాలా మంది అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. సమస్య వచ్చినప్పుడు కంగారు పడవలసిన అవసరం లేదు. చిన్న చిన్న సమస్యలకు ఇంటి చిట్కాలు సరిపోతాయి.

ఈ రోజు కీళ్లనొప్పులు,రక్తహీనత ,శారీరక బలహీనత వంటి సమస్యలను తగ్గించటానికి ఒక రెమిడీ తెలుసుకుందాం. చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దీని కోసం పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ పాలను పోసి కాస్త వేడి అయ్యాక 6 కిస్ మిస్ లను వేసి 5 నుంచి 6 నిమిషాల పాటు మరిగించాలి. మరిగిన పాలను గ్లాస్ లో పోసి కిస్ మిస్ తింటూ పాలను తాగాలి.

ఈ విధంగా 10 రోజుల పాటు తాగితే మీకు మంచి ఫలితం కనపడుతుంది. ఈ పాలను ఏ సమయంలోనైనా తాగవచ్చు. ఉదయం సమయంలో తాగితే రోజంతా ఉషారుగా ఉంటారు. కిస్ మిస్ ని పాలల్లో ఉడికించినప్పుడు పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాల పరిమాణం పెరుగుతుంది.

దాంతో ఆర్థరైటిస్ కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులువంటి వన్నీ తొలగి పోతాయి. రక్తహీనత సమస్య ఉన్నప్పుడు ఈ పాలను తాగితే రక్తహీనత సమస్య తగ్గిపోతుంది. ఎందుకంటే దీనిలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. గుండెకి సంబంధించిన సమస్యలు, అధిక రక్తపోటు, తక్కువ రక్తపోటు వంటి వాటిని తగ్గిస్తుంది.

ఎందుకంటే కిస్ మిస్ పాలలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఈ పాలను తాగితే శారీరక బలహీనత,అలసట, నిసత్తువ అన్ని తొలగిపోతాయి. పాలు,కిస్ మిస్ రెండూ కూడా మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ