Mango Murabba:నోరూరించే మ్యాంగో మురబ్బా ఇలా ఒక్కసారి చేయండి సంవత్సరం కమ్మగా తినేయవచ్చు..
Mango Murabba:నోరూరించే మ్యాంగో మురబ్బా ఇలా ఒక్కసారి చేయండి సంవత్సరం కమ్మగా తినేయవచ్చు.. ఈ సీజన్ లో మామిడికాయలు చాలా విరివిగా లభ్యం అవుతాయి. ఈ మామిడికాయలతో మురబ్బా చేసుకుంటే చాలా బాగుంటుంది. సంవత్సరం మొతం హ్యాపీగా తినవచ్చు..
కావాల్సిన పదార్థాలు:
– మామిడికాయలు (పచ్చివి, గట్టివి) – 1 కిలో
– పంచదార – 1.5 కిలో
– నీరు – 1 కప్పు
– యాలకుల పొడి – 1 టీస్పూన్
– కుంకుమపువ్వు (ఐచ్ఛికం) – చిటికెడు
తయారీ విధానం:
మామిడికాయలను శుబ్రంగా కడిగి తుడిచ తొక్క తీసి చిన్న ముక్కలుగా కోయండి.ఆ తర్వాత ఒక గిన్నెలో నీరు, పంచదార వేసి మీడియం మంట మీద మరిగించాలి. పంచదార కరిగి, ఒక తీగ లాగే సిరప్ ఏర్పడే వరకు మరిగించాలి.
ఈ సిరప్‌లో మామిడి ముక్కలు వేసి, తక్కువ మంట మీద 20-25 నిమిషాలు ఉడికించండి. ముక్క మెత్తగా మారే వరకు ఉడికించండి. ఆ తర్వాత యాలకుల పొడి, కుంకుమపువ్వు వేసి బాగా కలిపి మరో 2-3 నిమిషాలు ఉడికించి దించేయండి. మురబ్బాను చల్లారిన తర్వాత శుభ్రమైన, పొడి గాజు సీసాలో నిల్వ చేయండి. ఈ మురబ్బా దాదాపుగా సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది.
మురబ్బా చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మామిడి ముక్కలు గట్టిగా ఉండేలా చూసుకోండి, లేకపోతే మెత్తబడిపోతాయి.సీసాను ఎండలో ఉంచితే రుచి మరింత పెరుగుతుంది. రోటీ, పూరీ లేదా ఐస్‌క్రీంతో సర్వ్ చేయవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ