Kitchenvantalu

Roasted Almond Ice Cream:ఐస్ క్రీం సాఫ్ట్ గా అచ్చం బయట తిన్నట్టుగా ఇంట్లో చేయాలంటే ఇలా చేసేయండి

Roasted Almond Ice Cream:ఐస్ క్రీం సాఫ్ట్ గా అచ్చం బయట తిన్నట్టుగా ఇంట్లో చేయాలంటే ఇలా చేసేయండి. వేసవిలో ఐస్ cream తినాలంటే బయటకు వెళ్ళకుండా ఇంటిలోనే చాలా సులభంగా మంచి రుచితో చేసుకోవచ్చు. ఇప్పుడు Roasted Almond Ice Cream ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:
– బాదం – 1 కప్పు (రోస్ట్ చేసినవి)
– పాలు – 2 కప్పులు
– హెవీ క్రీమ్ – 1 కప్పు
– చక్కెర – 3/4 కప్పు
– వెనిల్లా ఎసెన్స్ – 1 టీస్పూన్
– గుడ్డు – 4
– ఉప్పు – చిటికెడు

బాదంలను ఒక పాన్‌లో మీడియం మంట మీద 5-7 నిమిషాలు వేయించి, చల్లార్చండి. వాటిని చిన్న ముక్కలుగా లేదా బరకగా మిక్సీ చేసి పక్కన పెట్టండి.ఆ తర్వాత గుడ్డు సొనలను ఒక గిన్నెలో వేసి కొట్టండి. పాలు మరియు చక్కెరను ఒక సాస్‌ పాన్‌లో వేడి చేసి, నెమ్మదిగా గుడ్డు సొనలలో కలపండి. అలా బాగా అన్కని కలిసేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని తిరిగి పాన్‌లో వేసి, తక్కువ మంట మీద గట్టిపడే వరకు ఉడికించి చల్లార్చండి.

కస్టర్డ్ లేకపోతే, పాలు, హెవీ క్రీమ్, చక్కెర, వెనిల్లా ఎసెన్స్, మరియు చిటికెడు ఉప్పును ఒక గిన్నెలో బాగా కలపండి. చక్కెర పూర్తిగా కరిగే వరకు కదిలించండి.రోస్ట్ చేసిన బాదం ముక్కలను మిశ్రమంలో వేసి కలపండి.ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో 1-2 గంటలు చల్లబరచండి.

ఈ మిశ్రమాన్ని ఒక డబ్బాలో వేసి ఫ్రీజర్‌లో ఉంచండి. ప్రతి 30 నిమిషాలకు ఒకసారి తీసి, గరిటెతో కలపండి (3-4 సార్లు)..అప్పుడు గడ్డకట్టకుండా ఉంటుంది. ఐస్‌క్రీమ్ గట్టిగా అయ్యాక, స్కూప్‌లతో తీసి బాదం ముక్కలతో అలంకరించి సర్వ్ చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ