Skin Care Tips:కొబ్బరి నూనెలో ఒక స్పూన్ కలిపి రాస్తే ముఖం యవ్వనంగా మెరిసిపోతుంది
Coconut Oil Skin Care:కొబ్బరి నూనెలో ఒక స్పూన్ కలిపి రాస్తే ముఖం యవ్వనంగా మెరిసిపోతుంది..సీజన్ ఏదైనా ముఖ సంరక్షణలో కొబ్బరినూనె కీలకమైన పాత్రను పోషిస్తుందని చెప్పవచ్చు. మనలో చాలామంది కొబ్బరి నూనె తలకు రాసుకుంటాం కదా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది కదా అని ఆలోచిస్తారు.
కానీ చర్మ సంరక్షణలో కూడా కొబ్బరి నూనె చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే చర్మాన్ని ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంచడంలో కొబ్బరినూనె ఒక మ్యాజిక్ లా పనిచేస్తుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
కొబ్బరి నూనెలో లినో లెనిక్ ఆమ్లం, యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు సమృద్ధిగా ఉండటం వలన మొటిమలు, ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే చర్మ సమస్యలు, వృద్ధాప్య ఛాయలు, ముడతలు, ఎండ వల్ల కమిలిన చర్మాన్ని కాంతివంతంగా చేయడం, పొడి చర్మాన్ని తేమగా చేయడం వంటి ప్రయోజనాలను పొందవచ్చు.
కొబ్బరి నూనెతో ఇప్పుడు చెప్పే ప్యాక్ వేసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది.ఒక బౌల్లో ఒక స్పూన్ బియ్యప్పిండి, ఒక స్పూన్ అలోవెరా జెల్, ఒక స్పూన్ పచ్చిపాలు, అర స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి.
పావుగంట అయ్యాక ముఖం మీద నీటిని జల్లుతూ ముఖాన్ని రబ్ చేస్తూ శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత అవసరమైతే మాయిశ్చరైసర్ రాసుకోవచ్చు. ఈ ప్యాక్ ని వారంలో రెండుసార్లు వేస్తే మొఖం యవ్వనంగా కాంతివంతంగా మారుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ