weight Loss:చెమట ఎక్కువగా పడితే బరువు తగ్గుతారా.. నిజం ఎంత..
weight Loss Tips:చెమట ఎక్కువగా పడితే బరువు తగ్గుతారా.. నిజం ఎంత.. మనలో చాలా మందికి ఎన్నో రకాల అపోహలు ఉంటాయి. వాకింగ్ చేసేటప్పుడు చెమట ఎక్కువగా పడితే బరువు తగ్గుతామని అనుకుంటూ ఉంటారు. అయితే దీనిలో ఎంత వరకు నిజం ఉందో తెలుసుకుందాం.
వ్యాయామం చేసినప్పుడు చెమట ఎక్కువగా పడుతూ ఉంటుంది. అలా చెమట పట్టినప్పుడు శరీరంలో నీరు బయటకు పోతుంది. కాబట్టి బరువు తగ్గుతామని అనుకుంటూ ఉంటారు. నిజానికి చెమట ఎక్కువ పట్టడం అనేది బరువు తగ్గడానికి కారణం కాదు. అది శరీరంలో నీటి కొరతను సూచిస్తుంది.
వ్యాయామం చేసినప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరిగి దానిని నియంత్రణ చేయడానికి చెమట పడుతుంది. చెమట ద్వారా బయటికి పోయే నీరు తాత్కాలికమే. మనం నీరు మళ్ళి తాగితే ఆ నీరు మన శరీరానికి అందుతుంది. కాబట్టి వాకింగ్ చేసినప్పుడు చెమట ఎక్కువ పడితే బరువు తగ్గినట్టు అనుకోకూడదు.
బరువు తగ్గాలంటే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు తగ్గాలి. కొవ్వు తగ్గాలంటే మనం తినే దానికన్నా ఎక్కువ కాలరీలను ఖర్చు చేయాలి. ఉదాహరణకు 1500 క్యాలరీలు ఆహారం తీసుకుంటే రెండు వేల కాలరీలు ఖర్చు అయితే అప్పుడు మనం బరువు తగ్గుతాం.
అంటే చెమట వల్ల కాదు.. కొవ్వు కరగటం ద్వారా మనం బరువు తగ్గుతాం. వ్యాయామం కారణంగా వచ్చే చెమట క్యాలరీలను ఖర్చు చేయటానికి ఉపయోగపడదు. కాబట్టి వ్యాయామం చేసినప్పుడు పట్టే చెమట మనం బరువు తగ్గడానికి అని అనుకోకూడదు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ