Saggubiyyam Vadiyalu:సగ్గుబియ్యం వడియాలు కరెక్ట్ కొలతలతో ఇలా చేస్తే చాలా బాగుంటాయి
Saggubiyyam Vadiyalu:సగ్గుబియ్యం వడియాలు కరెక్ట్ కొలతలతో ఇలా చేస్తే చాలా బాగుంటాయి.. వేసవిలో ఎండలు ఎక్కువగా ఉండుట వలన saggubiyyam vadiyalu పెడితే 3 రోజుల్లో ఎండిపోతాయి.
కావలసిన పదార్థాలు:
సగ్గుబియ్యం – 1 కప్పు
నీరు – 4-5 కప్పులు (సగ్గుబియ్యం ఉడికించడానికి)
ఉప్పు – రుచికి సరిపడా
జీలకర్ర – 1 టీస్పూన్
పచ్చిమిర్చి – 2-3 (పేస్ట్‌గా చేసినవి లేదా సన్నగా తరిగినవి)
నూనె – వడియాలు వేయడానికి (డీప్ ఫ్రై చేయడానికి)
తయారి విధానం
సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలో రెండు గంటల పాటు నీటిలో నానబెట్టాలి. అదే సన్న సగ్గుబియ్యం అయితే అరగంట సరిపోతుంది. పొయ్యి మీద ఒక పెద్ద పాత్ర పెట్టి దానిలో ఐదు కప్పుల నీటిని పోసి మరిగించి నానబెట్టిన సగ్గుబియ్యాన్ని దానిలో వేసి ఉడికించాలి.
సగ్గుబియ్యం పారదర్శకంగా మారేవరకు అంటే దాదాపుగా పది నుంచి 12 నిమిషాల పాటు ఉడికించాలి. ఉడికిన తర్వాత అదనంగా ఉన్న నీటిని తీసేసి సగ్గుబియ్యాన్ని చల్లారనివ్వాలి. చల్లారిన సగ్గుబియ్యంలో జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్ లేదంటే పచ్చిమిర్చి ముక్కలు, సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని ఒక ప్లాస్టిక్ షీట్ మీద చిన్న చెంచా తో గుండ్రని ఆకారంలో వడియాలు మాదిరిగా పెట్టాలి. వీటిని బాగా ఎండలో ఆరబెట్టాలి. ఇవి బాగా గట్టిగా ఎండిపోయినట్టు ఉండాలి. ఇవి దాదాపుగా సంవత్సరం నిలువ ఉంటాయి.
వడియాలను తినటానికి ముందు వేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం వడియాలను చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి కాస్త శ్రద్ధ పెట్టి ఈ వేసవికాలంలో ఈ వడియాలను పెట్టుకుంటే సంవత్సరం పొడవునా హ్యాపీగా తినవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

