Kitchenvantalu

Garlic Potato Balls:గార్లిక్ పొటాటో బాల్స్ పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇలా సింపుల్గా చెసేయొచ్చు

Garlic Potato Balls:గార్లిక్ పొటాటో బాల్స్ పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇలా సింపుల్గా చెసేయొచ్చు.. చాలా సులభంగా చేసేయవచ్చు. బంగాళదుంప అంటే పిల్లల నుండి పెద్దవారి వరకు అందరికి ఇష్టమే.. కాబట్టి గార్లిక్ పొటాటో బాల్స్ ఎలా చేయాలో చూద్దాం.

గార్లిక్ పొటాటో బాల్స్
కావాల్సిన పదార్థాలు (Ingredients):
– బంగాళదుంపలు (Potatoes) – 4 (మీడియం సైజ్, ఉడకబెట్టినవి)
– వెల్లుల్లి (Garlic) – 6-8 రెబ్బలు (తరిగినవి లేదా పేస్ట్)
– బ్రెడ్ ముక్కలు (Bread crumbs) – 1 కప్పు
– కారం పొడి (Red chili powder) – 1 టీస్పూన్
– జీలకర్ర పొడి (Cumin powder) – 1/2 టీస్పూన్
– గరం మసాలా (Garam masala) – 1/2 టీస్పూన్
– కొత్తిమీర (Coriander leaves) – 2 టేబుల్ స్పూన్లు (తరిగినవి)
– మైదా (All-purpose flour) – 2 టేబుల్ స్పూన్లు (పిండి కోసం)
– కార్న్ ఫ్లోర్ (Corn flour) – 2 టేబుల్ స్పూన్లు
– ఉప్పు (Salt) – రుచికి తగినంత
– నీళ్లు (Water) – పిండి కలపడానికి
– నూనె (Oil) – వేయించడానికి

తయారీ విధానం (Preparation Method):
బంగాళదుంపలను ఉడికించి చల్లారిన తర్వాత పై తొక్క తీసి మెత్తగా చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. ఆ తర్వాత దానిలో తరిగిన వెల్లుల్లి, ఎర్ర కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు, కొత్తిమీర వేసి అన్ని బాగా కలిసేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న బాల్స్ మాదిరిగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

ఒక గిన్నెలో మైదాపిండి, కార్న్ ఫ్లోర్, చిటికెడు ఉప్పు, కొంచెం నీళ్లు వేసి పలచని పిండి మాదిరిగా అంటే బజ్జీల పిండి మాదిరిగా కలుపుకోవాలి.

మరో గిన్నెలో బ్రెడ్ పొడి రెడీ చేసుకోవాలి. తయారుచేసి పెట్టుకున్న బంగాళదుంప బాల్స్ ని ముందుగా పిండిలో ముంచి ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్ లో కోడ్ చేసి నూనెలో డీప్ ఫ్రై చేయాలి.

ఇవి గోల్డ్ కలర్ వచ్చేవరకు వేగించాలి. వీటిని టిష్యూ పేపర్ మీద వేస్తే అదనపు నూనె టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది. వీటికి టమాట సాస్ మంచి కాంబినేషన్. సాయంత్రం సమయంలో వేడి వేడి గార్లిక్ పొటాటో బాల్స్ తింటే చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తింటారు. మరి ఇక ఆలస్యం ఎందుకు ట్రై చేసేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ