Pesara Pindi Avakaya:పూర్తి కొలతలతో పాత కాలం నాటి పెసర పిండి ఆవకాయ..
Pesara Pindi Avakaya:పూర్తి కొలతలతో పాతకాలం నాటి పెసర పిండి ఆవకాయ .. ఈ సీజన్ లో ఆవకాయ పెట్టుకుంటూ ఉంటాం. నార్మల్ ఆవకాయ కాకుండా పెసర పిండితో చేసుకొనే ఆవకాయ చాలా బాగుంటుంది.
కావలసిన పదార్థాలు
– పెసర పప్పు – 1 కప్పు
– మామిడికాయలు (పచ్చివి, గట్టిగా ఉన్నవి) – 2 (మీడియం సైజు)
– కారం (ఎండుమిర్చి పొడి) – 1/4 కప్పు
– ఆవపొడి – 1/4 కప్పు
– ఉప్పు – 1/4 కప్పు (రుచికి సరిపడా)
– నూనె (నువ్వుల నూనె లేదా ఆవనూనె) – 1/2 కప్పు
– మెంతిపొడి – 1 టీస్పూన్
– ఇంగువ – చిటికెడు
– పసుపు – 1/2 టీస్పూన్
– ఆవాలు – 1 టీస్పూన్
– ఎండుమిర్చి – 2-3
– కరివేపాకు – 1 రెమ్మ
తయారీ విధానం
ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి నీటిలో నాలుగు గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత నీటిని వడగట్టి నానిన పప్పును మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ గా తయారు చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టాలి. ఇక ఇప్పుడు మామిడి కాయలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ముక్కలను శుభ్రమైన క్లాత్ తో తుడిచి పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఒక గిన్నెలో కారం, ఉప్పు, ఆవపిండి, మెంతిపొడి, పసుపు, ఇంగువ వేసి బాగా కలపాలి.ఆ తర్వాత దీనిలో పెసరపప్పు పేస్ట్ వేసి బాగా కలపాలి. ఇక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసి అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి.
ఈ మామిడికాయ ముక్కల మిశ్రమాన్ని శుభ్రమైన పొడి గాజు లేదా సిరామికి జాడీలో పెట్టుకొని నిలువ చేసుకోవాలి. ఒక చిన్న పాన్లో నూనె వేసి వేడి చేసి ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేగాక చల్లార్చి ఆవకాయ మీద పోసి బాగా కలపాలి.
జాడీని గట్టిగా మూత పెట్టి రెండు మూడు రోజులు అలా వదిలేసి ఆ తర్వాత ఒకసారి కలపాలి. అంతే ఎంతో రుచికరమైన పెసరపప్పు ఆవకాయ రెడీ.. ఇది అన్నం, ఇడ్లీ, దోశ వంటి వాటికి మంచి కాంబినేషన్ అని చెప్పవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

