Vankaya Kobbari Karam:వంకాయ కొబ్బరి కారం ఓసారి ఇలా చేసి చూడండి అన్నం మొత్తం తినేస్తారు..
Vankaya Kobbari Karam:వంకాయ కొబ్బరి కారం ఓసారి ఇలా చేసి చూడండి అన్నం మొత్తం తినేస్తారు.. వంకాయ అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. ఇప్పుడు చెప్పే వంకాయతో కొబ్బరి కలిపి చేసే కూర చాలా బాగుంటుంది.
కావాల్సిన పదార్థాలు
– వంకాయలు – 4-5 (మధ్యస్థ పరిమాణం)
– కొబ్బరి తురుము – 1 కప్పు (తాజాది)
– ఎండుమిర్చి – 4-5 (రుచికి సరిపడా)
– వెల్లుల్లి రెబ్బలు – 3-4
– జీలకర్ర – 1 టీస్పూన్
– ఉప్పు – రుచికి సరిపడా
– నూనె – 2 టేబుల్ స్పూన్లు
– కరివేపాకు – 1 రెమ్మ
– ఆవాలు – 1/2 టీస్పూన్
– పసుపు – 1/4 టీస్పూన్
తయారి విధానం
వంకాయలను శుభ్రంగా కడిగి ముచ్చిక తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను ఉప్పు కలిపిన నీటిలో పది నిమిషాలు ఉంచాలి. ఒక పాన్లో ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర వేసి తక్కువ మంటలో మంచి వాసన వచ్చేవరకు వేయించాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేయాలి. ఆ తర్వాత కొబ్బరి తురుము, ఉప్పు కూడా వేసి మెత్తని పేస్ట్ గా మిక్సీ చేయాలి.
ఒక పాన్ లో నూనె వేసి వేడి చేసి ఆవాలు, కరివేపాకు, పసుపు వేసి కొంచెం వేగాక కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసి మెత్తగా అయ్యేవరకు వేగించాలి. వంకాయ ముక్కలు మెత్తగా వేగిన తరువాత మెత్తగా చేసి పెట్టుకున్న కొబ్బరి కారం మిశ్రమాన్ని వేసి సిమ్లో పెట్టి రెండు మూడు నిమిషాలు కలుపుతూ వేయించాలి.
అంతే వంకాయ కొబ్బరి కారం తయారైనట్టే.. ఇది అన్నం, రొట్టె, చపాతి, బట్టర్ నాన్ ఇలా అన్నింటికీ చాలా బాగుంటుంది. రుచి కోసం కొత్తిమీర కూడా కలుపుకోవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

