Ice Apple:వేసవిలో లభించే తాటి ముంజలు తింటే ఏమి అవుతుందో తెలుసా..?
Ice Apple:వేసవిలో లభించే తాటి ముంజలు తింటే ఏమి అవుతుందో తెలుసా..వేసవిలో లభించే తాటి ముంజలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. తాటి ముంజలలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వలన వేసవి కాలంలో వీటిని తింటే శరీరంలో వేడిని తగ్గించి చల్లదనం కలిగేలా చేస్తుంది.
వీటిలో ప్రోటీన్స్, ఐరన్, పొటాషియం,కాల్షియం, కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. వేసవిలో తరచుగా వీటిని తింటూ ఉంటే శరీరం చల్లగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే వేసవికాలంలో శరీరంలో వేడిని తగ్గించడానికి ప్రకృతి ప్రసాదించిన వరంగా చెప్పవచ్చు. అలసట, నీరసం తగ్గించి శరీరాన్ని ఎనర్జీగా ఉండటానికి ప్రోత్సహిస్తుంది.
ముఖ్యంగా ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా చేస్తుంది. శరీర ఉష్ణోగ్రత తగ్గి డిహైడ్రేషన్ సమస్య లేకుండా చేస్తుంది. అంతేకాకుండా చర్మానికి అవసరమైన తేమను అందించడమే కాకుండా చర్మం పొడిగా లేకుండా చెమట పొక్కులు లేకుండా చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తొలగిస్తుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా మంచి ఆహారంగా చెప్పవచ్చు.
శరీరానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన వేసవిలో వచ్చే సమస్యలకు చెక్ పెడుతుంది. దీనిలో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా చేసి మోకాళ్ళ నొప్పులు, కీళ్లనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. రక్తపోటు నియంత్రణలో ఉంచి గుండెను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ